Moviesవిడాకులు తీసుకుని విడిపోయిన 15 సెల‌బ్రిటీ క‌ఫుల్స్‌... గొప్ప ప్రేమ‌లు ఢ‌మాలే...!

విడాకులు తీసుకుని విడిపోయిన 15 సెల‌బ్రిటీ క‌ఫుల్స్‌… గొప్ప ప్రేమ‌లు ఢ‌మాలే…!

సెల‌బ్రిటీలు ఎంతో గొప్ప‌గా ప్రేమించుకుంటారు.. వారు పెళ్లికి ముందు ప్రేమ‌లోనూ, డేటింగుల్లోనూ ఉంటే పెద్ద హైలెట్ అవుతుంది. అలా ఎంతో గొప్ప‌గా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట‌లు ఈగోలతో విడిపోతూ ఉంటారు. ఏళ్ల‌కు ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కేవ‌లం ఇగోలు, ఇత‌ర ఆక‌ర్ష‌ణ‌ల కార‌ణంగా వీరు స‌ర్దుబాటు చేసుకోలేక విడిపోవ‌డం కామ‌న్ అయిపోయింది. అలా విడిపోయిన కొంద‌రు టాప్ సెల‌బ్రిటీల గురించి తెలుసుకుందాం.

1- రేవ‌తి – సురేష్ మీన‌న్‌:
1986 లో రేవతి, నటులు సురేష్ చంద్రమీనన్ పెళ్లి చేసుకున్నారు. ఎన్నో ఏళ్ల కాపురం త‌ర్వాత 2013లో ఈ జంట విడిపోయారు. అస‌లు ఈ జంట విడిపోతార‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు.

2- నాగార్జున – ద‌గ్గుబాటి ల‌క్ష్మి:
ప్ర‌ముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున – దివంగ‌త లెజెండ్రీ నిర్మాత ద‌గ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీల‌క్ష్మిని 1984లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు నాగ‌చైత‌న్య పుట్టాక మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో 1990లో విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత నాగార్జున హీరోయిన్ అమ‌ల‌ను పెళ్లి చేసుకుంటే.. శ్రీల‌క్ష్మి కూడా మ‌రో పెళ్లి చేసుకుంది.

3 – మమతా మోహన్ దాస్ – ప్రజీత్ పద్మనాభన్:
తెలుగు సినిమాల‌తో ప్రేక్ష‌కులు బాగా ప‌రిచ‌యం అయిన మ‌మ‌తామోహ‌న్ దాస్ 2011లో ప్ర‌జీత్ ప‌ద్మ‌నాభ‌న్‌ను పెళ్లి చేసుకుంది. 2012లోనే వీరు విడిపోయారు. ఇక మ‌మ‌తా మోహ‌న్ దాస్ క్యాన్స‌ర్‌ను జయించింది.

4- అదితి రావు హైదరి – సత్యదీప్ మిశ్రా:
2009లో అదితి రావు హైదరి – సత్యదీప్ మిశ్రా పెళ్లి చేసుకుని 2013 లో వీళ్లిద్దరు విడిపోయారు. విడాకుల త‌ర్వాత అదితి రావు కెరీర్ స్పీడ‌ప్ అయ్యింది.

 

5- సైఫ్ ఆలీఖాన్ – అమృతాసింగ్‌:
బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ అమృతాసింగ్‌, సైఫ్ ఆలీఖాన్ 1991లో పెళ్లి చేసుకుని ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక 2004లో విడాకులు తీసుకున్నారు. విచిత్రం ఏంటంటే అమృతాసింగ్ కంటే సైఫ్ వ‌య‌స్సులో చాలా చిన్నోడు.. ఆమెకు అంత‌కు ముందే ర‌విశాస్త్రితో ఎఫైర్ ఉంద‌న్న టాక్ ఉంది. ఆమెకు విడాకుల త‌ర్వాత సైఫ్ త‌న‌కంటే చాలా చిన్న‌ది అయిన క‌రీనాను పెళ్లాడాడు.

6- అరవింద స్వామి – గాయత్రి రామమూర్తి:
1994 లో అరవింద స్వామి, గాయత్రి రామ‌మూర్తిని పెళ్లి చేసుకుని 2010లో విడిపోయారు.

7- మంచు మనోజ్ – ప్రణతి:
ముంచు మోహ‌న్‌బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్‌, ప్ర‌ణ‌తి రెడ్డిని 2015లో వివాహం చేసుకుని.. 2019లో విడిపోయాడు. ప్ర‌స్తుతం మ‌నోజ్ సింగిల్‌గానే ఉంటున్నాడు.

8- నోయల్ – ఎస్తేర్:
నోయ‌ల్‌, హీరోయిన్ ఎస్తేర్‌ను 2019లో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నాడు. అయితే 2020లోనూ అంద‌రికి షాక్ ఇస్తూ వీరు విడిపోయారు.

9- సుమంత్ – కీర్తి రెడ్డి:
2004 లో సుమంత్, కీర్తి రెడ్డి పెళ్లి చేసుకున్నారు. 2006 లో వీళ్లు సపరేట్ అయ్యారు. వీరి విడాకులు ఇండ‌స్ట్రీలో చాలా మంది జీర్ణించుకోలేక‌పోయారు.

10- రాధిక – ప్రతాప్ పోతన్:
1985లో నటుడు ప్రతాప్ పోతన్‌తో రాధిక పెళ్లి జరిగింది. 1986లో వాళ్ళిద్దరూ విడిపోయారు. 1990 లో రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకున్న రాధిక అత‌డితో కూడా 1992లో విడిపోయింది. ఆ త‌ర్వాత ఆమె 2001లో శ‌ర‌త్‌కుమార్‌ను ముచ్చ‌ట‌గా మూడో పెళ్లి చేసుకుంది.

11. అర్బాజ్ ఖాన్ – మలైకా అరోరా:
బాలీవుడ్ నటి మలైకా అరోరా, సల్మాన్ ఖాన్ తమ్ముడు, నటుడు అయిన అర్బాజ్ ఖాన్ 1998లో పెళ్లి చేసుకున్నారు. 2017 లో వీళ్ళిద్దరూ విడిపోయారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. అర్బాజ్‌తో విడిపోయాక మ‌లైకా త‌న కంటే 12 ఏళ్లు చిన్నోడు అయిన అర్జున్‌క‌పూర్‌తో ఫుల్ డేటింగ్‌లో ఉంది.

12- క‌మ‌ల్‌హాస‌న్ – వాణి గ‌ణ‌ప‌తి:
సీనియ‌ర్ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ 1978లో ప్ర‌ముఖ న‌ర్త‌కి వాణి గ‌ణ‌ప‌తిని పెళ్లి చేసుకున్నాడు. ప‌దేళ్ల త‌ర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి 1988లో సారిక‌ను పెళ్లి చేసుకున్నారు. శృతీహాస‌న్ ఈ దంప‌తుల కుమార్తే. అనంత‌రం 2004లో సారిక‌కు విడాకులు ఇచ్చి మ‌రో న‌టి గౌత‌మితో చాలా యేళ్లు స‌హ‌జీవ‌నం చేశారు. ఆ త‌ర్వాత ఇప్పుడు ఆమెకు కూడా దూరం అయ్యారు.

13- ప్రకాష్ రాజ్ – లలిత కుమారి:
1994 లో నటి లలిత కుమారిని వివాహం చేసుకున్నారు ప్రకాష్ రాజ్. ముగ్గురు పిల్ల‌ల త‌ర్వాత 2009లో వారు విడాకులు తీసుకున్నారు. అనంత‌రం 2010లో కొరియోగ్రాఫ‌ర్ పోనివ‌ర్మ‌ను ప్ర‌కాష్‌రాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు.

14- హృతిక్ రోషన్ – సుసానే ఖాన్ :
2000 సంవత్సరంలో హృతిక్ రోషన్ త‌న చిన్న‌నాటి ప్రియురాలు సుసానేఖాన్‌ను పెళ్లి చేసుకుని.. ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక 2014లో విడిపోయారు.

15- నాగ చైతన్య – సమంత :
2017లో పెళ్లి చేసుకున్న వీరు 2021లో విడాకులు తీసుకుని.. అంద‌రికి షాక్ ఇచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news