Moviesమాజీ ప్ర‌పంచ సుంద‌రి సుస్మితాసేన్‌కు అంత‌మందితో ఎఫైరా...!

మాజీ ప్ర‌పంచ సుంద‌రి సుస్మితాసేన్‌కు అంత‌మందితో ఎఫైరా…!

మాజీ ప్ర‌పంచ సుంద‌రి సుస్మితాసేన్ నాలుగున్న‌ర ప‌దుల వ‌య‌స్సు వ‌చ్చినా కూడా ఇప్ప‌టికి పెళ్లి చేసుకోలేదు. ఇటీవ‌ల వ‌ర‌కు వ‌య‌స్సులో త‌న‌కంటే చాలా చిన్నోడు అయిని రోహ్మ‌న్‌తో డేటింగ్ చేస్తూ ఆమె ఇటీవ‌ల అత‌డికి బ్రేక‌ప్ చెప్పేసింది. పెళ్లి చేసుకోకుండానే ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకుని పెంచుకుంటోంది. ఇక ఆమె తాజాగా త‌న కంటే చిన్నోడితో కూడా కొద్ది రోజులు స‌హ‌జీవ‌నం చేసి బ్రేక‌ప్ చెప్ప‌డంతో ఇప్పుడు ఆమె గ‌త ఎఫైర్లు కూడా సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

సుస్మిత 1994లో మిస్‌యూనివ‌ర్స్ కిరీటం సొంతం చేసుకుంది. ఆ త‌ర్వాత ఆమెకు మాంచి ఇమేజ్ వ‌చ్చింది. బాలీవుడ్‌లో మంచి అవ‌కాశాలు వ‌చ్చాయి. తెలుగులో కూడా నాగార్జున స‌ర‌స‌న ర‌క్ష‌కుడు సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. ఆ త‌ర్వాత ఒకేఒక్క‌డు సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఇప్ప‌ట‌కీ ఉర్రూత‌లూగించేస్తూ ఉంటుంది. ఆ క్రేజ్‌తోనే సుస్మిత ప‌లువురితో ఎఫైర్లు కొన‌సాగిస్తూ వార్త‌ల్లో నిలిచేది. పెళ్లయిన వారితో కూడా ఆమె ఎఫైర్లు పెట్టుకున్న‌ట్టు టాక్ ?

ఆమె 1994లో ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త‌తో తొలి ఎఫైర్ ఎట్టుకుంది. అత‌డికి రెస్టారెంట్లు ఉండేవి. ఆ త‌ర్వాత బాలీవుడ్ న‌టుడు ర‌ణ‌దీప్ హుడాతో డేటింగ్ చేసింది. ఆ త‌ర్వాత ఏమైందో కాని.. వారి రిలేష‌న్ కూడా ఎక్కువ కాలం నిల‌వ‌లేదు. ఆ త‌ర్వాత బంటీ స‌జ్దేవ్‌తో ఎఫైర్ పెట్టుకుంద‌న్న టాక్ ఉంది. ఆ త‌ర్వాత హాట్‌మెయిల్ వ్య‌వ‌స్థాప‌కుడు స‌బీర్ భాటియాతోనూ ఆమె వార్త‌ల్లోకి ఎక్కింది.

అనంత‌రం ద‌ర్శ‌కుడు ముద‌స్స‌ర్ అజిజ్‌తో క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగింది. మరో బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే పాకిస్తాన్ మాజీ బౌల‌ర్ వ‌సీం అక్ర‌మ్‌తో కూడా ఆమె కొంత‌కాలం రిలేష‌న్ షిప్‌లో ఉంద‌న్న రూమ‌ర్లు వ‌చ్చాయి.ఇక చివ‌రిగా త‌న‌కంటే వ‌య‌స్సులో 15 ఏళ్లు చిన్న‌వాడు అయిన రోహ్మ‌న్‌తో ఎఫైర్ పెట్టుకుని.. చాలా రోజులుగా స‌హజీవ‌నం కూడా చేసింది. రీసెంట్ ట్విస్ట్ ఏంటంటే అత‌డికి కూడా దూరం అయిన‌ట్టు ప్ర‌క‌టించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news