Moviesఎన్టీఆర్ జిస్టిస్ చౌద‌రి సినిమా రిలీజ్ టైంలో ఇంత జ‌రిగిందా...!

ఎన్టీఆర్ జిస్టిస్ చౌద‌రి సినిమా రిలీజ్ టైంలో ఇంత జ‌రిగిందా…!

విశ్వ‌విఖ్యాత నటరత్న పద్మశ్రీ ఎన్టీఆర్, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాలు వ‌చ్చాయి. వీటిల్లో జ‌స్టిస్ చౌద‌రి పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. 1982 మే 28న రిలీజైన జస్టిస్ చౌదరి మూవీ అప్ప‌ట్లో ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం ప్రేక్ష‌కుల మ‌దిలో ఇప్ప‌ట‌కీ అలా నిలిచిపోయింది. ఎన్టీఆర్ డ‌బుల్ రోల్ చేయ‌గా.. శ్రీదేవి హీరోయిన్‌గా న‌టించింది. కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, రావుగోపాల రావు విల‌న్లుగా న‌టించారు.

చ‌ట్టానికి న్యాయానికి జ‌రిగిన ఈ సంగ్రామంలో పాట పెద్ద హైలెట్ అయ్యింది. ఆ సంవ‌త్స‌రం బొబ్బిలిపులి సినిమా త‌ర్వాత సెకండ్ హయ్య‌స్ట్ గ్రాస‌ర్‌గా చౌద‌రి సినిమా నిలిచింది. అస‌లు ఈ సినిమాలో పాట‌లు అన్ని సంచ‌ల‌నం. చ‌క్ర‌వర్తి బాణీలు నాడు ఆంధ్ర‌దేశాన్ని ఊపేశాయి. ముద్దుమీద ముద్దు పెట్టు – ఒక‌టో నెంబ‌రు బ‌స్సు – అబ్బ ముసిరేసింది.. అయ్యో చ‌లివేసింది – నీ చ‌క్కిలి వెల ఎంత – నీ తొలి చూపులోనే – శ్రీ ల‌క్ష్మి పెళ్లికి చిరున‌వ్వు క‌ట్న‌ము – చ‌ట్టానికి న్యాయానికి పాట‌లు అన్ని కూడా ప్రేక్ష‌కుల‌ను ఊపేశాయి.

సినిమా రిలీజ్‌కు ముందే సూప‌ర్ హిట్ అన్న టాక్ వ‌చ్చేసింది. ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా రిలీజ్ టైంలో పెద్ద పండ‌గ చేసుకున్నారు. ఈ సినిమా హిట్ అయ్యాక నాడు ఆంధ్ర‌దేశంలో ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని అప్ప‌టికే ఉన్న డిమాండ్లు ఇంకా పెరిగిపోయాయి. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తే ఖ‌చ్చితంగా ముఖ్య‌మంత్రి అయిపోతార‌న్న ప్ర‌చారం కూడా గ‌ట్టిగా న‌డిచింది.

ఇక ఈ సినిమాకు పోటీగా చాలా సినిమాలు వ‌చ్చాయి. చౌద‌రి సినిమాకు 13 రోజుల ముందు జంధ్యాల డైరెక్ష‌న్‌లో నాలుగు స్తంభాలాట మూవీ వ‌చ్చింది. నరేష్, పూర్ణిమ, ప్రదీప్ నటించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. చౌద‌రి మే 28న రిలీజ్ అయితే జూన్ 11న చిరంజీవి శుభ‌లేఖ కె. విశ్వనాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కి రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా హిట్‌. ఆ మ‌రుస‌టి రోజే జూన్ 12న శోభ‌న్‌బాబు కోరుకున్న మొగుడు రిలీజ్ అయ్యింది. జయసుధ, శ్రీలక్ష్మి హీరోయిన్లుగా న‌టించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news