Moviesమోహ‌న్‌బాబు - రాజ‌మౌళి మ‌ధ్య గ్యాప్‌కు అదే కార‌ణ‌మా...!

మోహ‌న్‌బాబు – రాజ‌మౌళి మ‌ధ్య గ్యాప్‌కు అదే కార‌ణ‌మా…!

టాలీవుడ్ లో సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు క్రమశిక్షణకు మారుపేరు. మోహన్ బాబు అంటే ఇండస్ట్రీలో చాలామందికి భయం. ఆయన లోపల ఏదీ దాచుకోరు. కోపం వస్తే.. ఉన్నది ఉన్నట్టు బయటకు కక్కేస్తారు. అందుకే చాలామంది మోహన్‌బాబుతో పెట్టుకునే విషయంలో వెనకడుగు వేస్తారు. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మోహన్ బాబు విలన్ గా, హీరోగా, నిర్మాతగా ఇలా ఎన్నో రోల్స్‌తో ఇండస్ట్రీలో తనదైన పాత్ర పోషిస్తున్నారు. రాజకీయంగా కూడా మోహన్ బాబుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పలుకుబడి ఉంది.

ఇక రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటారు. రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతో మంది స్టార్ హీరోలు సైతం కలలుకంటూ ఉంటారు. రాజమౌళిని తన పెద్ద కుమారుడు మంచు విష్ణు కోసం ఒక సినిమా చేసి పెట్టమని గతంలో మోహన్‌బాబు అడిగారట. ఆ టైంలో రాజమౌళి సై – సింహాద్రి – విక్రమార్కుడు – ఛ‌త్రపతి – యమదొంగ లాంటి సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు.

అప్పుడు రాజమౌళితో మంచు విష్ణుకు ఒక హిట్ సినిమా పెడితే విష్ణు కెరీర్‌ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని మోహన్ బాబు భావించి ఉండవచ్చు. అయితే రాజమౌళి మాత్రం విష్ణుతో సినిమా చేసే టైం వస్తే తప్పక సినిమా చేస్తాను… అయితే ఇప్పుడు ఏదో ఒక కథతో సినిమా చేయడం తనకు ఇష్టం లేదని మోహన్ బాబుతో అన్నారట.

అప్పుడు మోహన్ బాబు ఇండస్ట్రీలో తాను ఏమడిగినా ఎవరు కాదనలేరు అని… తన కొడుకు కోసం ఒక సినిమా చేసి పెట్టమని అడిగితే రాజమౌళి కుదరదు అని చెప్పటంతో ఆయన నొచ్చుకున్నారు అట. అయితే రాజమౌళికి విష్ణుతో సినిమా చేయకూడ‌దు అని ఏం లేదు… విష్ణుకు తగిన కథ ఉండాలన్నది ఆయ‌న ఆలోచ‌న‌.

మోహన్‌బాబు వెర్ష‌న్‌ మరోలా ఉంది. ఆ టైంలో విష్ణుకు ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా వస్తే… కెరీర్ పరంగా కాస్త ముందుకు వెళతాడ‌ని ఆయన ఆశించారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో మోహన్ బాబు యముడి పాత్రలో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news