Moviesవార్ని.. సినిమా ప్రమోషన్స్ కోసమే ఆని కోట్లా..నువ్వు మామూలోడివి కాదు సామీ...

వార్ని.. సినిమా ప్రమోషన్స్ కోసమే ఆని కోట్లా..నువ్వు మామూలోడివి కాదు సామీ ..!!

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన రాజమౌళి.. మరో బిగ్గెస్ట్ మూవీతో రంగంలోకి దిగబోతున్నారు.’బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ఎల్లలు దాటించిన రాజమౌళి.. మళ్ళీ అదే రేంజ్‌లో RRR రూపొందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘రౌద్రం, రణం, రుధిరం. ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా ఇది.పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్నారు.

భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్‌లోనే ఇద్ద‌రు క్రేజీ యంగ్‌స్ట‌ర్స్ అయిన యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారిగా క‌లిసి తెర‌పై స్క్రీన్ షేర్ చేసుకోవ‌డంతో ఆర్ ఆర్ ఆర్ పై అంచ‌నాలు మామూలుగా లేవు. ఇక దానికి తగ్గత్లే జక్కన్న ఏ డైరెక్టర్ కూడా చేయని విధంగా ఈ సినిమాకి ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తూ సినిమాకు మరింత హైప్ తీసుకోస్తున్నారు.

ప్రమోషన్స్ లో భాగంగా చరణ్,తారక్,రాజమౌళి,అలియా భత్ అన్నీ రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. ఒక సినిమా విడుదలవుతోందంటే దాన్ని ప్రమోట్ చేయడా నికి రకరకాల ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. అయితే ‘ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్’ ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని మరో లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి తీసుకెళ్లారు రాజమౌళి. ప్యాన్ ఇండియా సినిమా కావడంతో ప్రతి భాషలోనూ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి సిటీలోనూ ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్స్ పెడుతున్నారు. అక్కడి ఫేమస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీవీ షోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సైతం పాల్గొని అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు.

ఇక తాజాగా లీక్ అవుతున్న సమాచరం బట్టి రాజమౌళి చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కోసమే ఏకంగా 52 కోట్లు ఖర్చు చేసారట. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో గోండు వీరుడు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటించగా.. అల్లూరి సీతారామరాజు రోల్‌లో రామ్ చరణ్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన RRR పోస్టర్స్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్‌ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటూ యూ ట్యూబ్ రికార్డ్స్ షేక్ చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news