Moviesవద్దు తల్లో నీకు దండం పెడతాం..ఆ పని మాత్రం చేయకు..?

వద్దు తల్లో నీకు దండం పెడతాం..ఆ పని మాత్రం చేయకు..?

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోకు అన్ని భాషల్లో ఆదరణ ఎక్కువగానే ఉంది. తెకుగులోనే అతి పెద్ద రియాలిటీ షో గా ఉన్న బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షో సీజన్ 5 ఈ ఈమధ్యనే ముగిసింది. అందరు అనుకున్నట్లే వీజే సన్నీ కప్ ను ఎగరేసుకునిపోయాడు. ఇక ఫైనల్ ఎపిసోద్ లో నాగార్జున మాట్లాడుతూ.. రెండు నెలల్లోనే నెక్స్ట్‌ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా స్టార్ట్ కానున్నట్టు కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మ్ చేశారు. ఐదు సీజన్లుగా ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈషో ఇకపై ఓటీటీ వేదికగానూ 24X7 అలరించనుంది. ఈ విషయాన్ని తాజాగా డిస్నీ హాట్‌స్టార్‌ యాజమాన్యంతోపాటు నటుడు నాగార్జున ప్రకటించారు.

అయితే బుల్లితెరపై కాదు.. ఓటీటీ వేదికగా ఈసారి బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాస్ మొదలు కాబోతోంది. హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రీమ్ కాబోతోంది. దానికి కూడా నాగార్జునే హోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. గత మూడు సీజన్స్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగ్‌.. ఓటీటీ బిగ్‌బాస్‌కి కూడా హోస్టింగ్‌ చేయనున్నాడు. అయితే, దీన్ని భిగ్గ్ భొస్స్ సీజన్ 6గా ప్రసారం చేస్తారా లేదా ‘బిగ్ బాస్-ఓటీటీ’గా స్ట్రీమింగ్ చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఓటీటీ వెర్షన్.. ప్రస్తుతం ఉన్న ఫార్మాట్‌లో కాకుండా సరికొత్తగా ఉంటుందని షో నిర్వాహకులు అంటున్నారు.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఓటీటీలో ప్రసారమయ్యే ఈ బిగ్ బాస్.. కేవలం 6 వారాలు లేదా 49 రోజులు మాత్రమే ఉంటుందట. అంతేకాదు ..ఇప్పటివరకు మీరు మనం చూసిన బిగ్ బాస్ కి ఇప్పుడు ఓటీటీలో చూడబోతున్న బిగ్ బాస్ కి చాలా తేడా ఉంటుందట. ఇక ఈ బిగ్ బాస్ కోసం కేవలం 12 మందినే సెలెక్ట్ చేసి..కంటెస్టెంట్స్ గా లోపలకి పంపిస్తారట.

అన్నిటికన్న పెద్ద షాకింగ్ న్యూస్ ఎమిటంటే ప్రైజ్ మనీ..బిగ్ బాస్ ఓటీటీకి రెగ్యులర్ బిగ్ బాస్ విన్నర్ కంటే కంటే తక్కువ ఉంటుందని.. సుమారు రూ.25 లక్షలు ఉంటుందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే షో నిర్వాహకులు కొందరు పాపులర్ కంటెస్టెంట్స్ ని కూడా సెలక్ట్ చేసారట. వాళ్ళలో పేధానంగా వినిపిస్తున్న పేరులు: యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ శివ , ‘ఢీ-10’ విజేత రాజు, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌’వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ వైష్ణవి, సోషల్‌ మీడియా స్టార్‌ వరంగల్‌ వందన, యాంకర్‌ ప్రత్యూష పేర్లు వినిపిస్తున్నాయి.

ఇక వైష్ణవి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుంది అని తెలిసిన ఆమె అభిమానులు..సోషల్ మీడియా వేదికగా వాళ్ల అభిప్రాయాని తెలియజేస్తున్నారు. బిగ్ బాస్ షో కి వెళ్లి నీకు ఉన్న పాపులారిటీని పోగొట్టుకోకు తల్లో అంటూ నీకు దండం పెడతాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి బిగ్ బాస్ షోకి వెళ్ళిన తరువాత బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి పేరుతో వస్తారో మనకు తెలిసిన విషయమే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news