MoviesRRR టైటిల్ వెన‌క సీక్రెట్ చెప్పిన రాజ‌మౌళి...!

RRR టైటిల్ వెన‌క సీక్రెట్ చెప్పిన రాజ‌మౌళి…!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి ది కంక్లూజన్ సినిమా తర్వాత తెరకెక్కింది త్రిబుల్ ఆర్ మూవీ. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన థియేటర్లలోకి రానుంది. అగ్ర నిర్మాత డివివి దానయ్య రు. 450 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ఎప్పుడు థియేటర్ల‌ లోకి వస్తుందా ? అని కోట్లాది మంది అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఓవరాల్ గా రు. 600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నార్త్ నుంచి సౌత్‌ వరకు ఆ సినిమా ప్రమోషన్లు హోరెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఆర్ ఆర్ ఆర్ అన్న టైటిల్ ఎందుకు పెట్టారు ? ఆ సందర్భం ఏంటి అన్న దానిపై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. త్రిబుల్ ఆర్‌ సినిమా హిందీ ప్రమోషన్లలో పాల్గొన్న రాజమౌళి అసలు టైటిల్ ఏం పెట్టాలో ? క్లారిటీ లేకపోవడంతో ఆర్ ఆర్ ఆర్ అని పెట్టామ‌ని సంచలన విషయం చెప్పారు.

ముందు నుంచి కూడా RRR హ్యాష్ ట్యాగ్‌తోనే ఈ సినిమా అప్‌డేట్స్ ఇచ్చామ‌ని చెప్పారు. ఆ తర్వాతే ఈ సినిమాకు తెలుగుతో పాటు హిందీ… ఇతర భాషల నుంచి సైతం టైటిల్‌ విషయంలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు. ఇక త్రిబుల్ ఆర్ సినిమా వాయిదా పడుతుందని వస్తున్న వార్తలన్ని ఊహాగానాలే అని కొట్టిపారేశారు. మనదేశ సంస్కృతి తోపాటు విప్లవం – భావోద్వేగం సమ్మేళనమే త్రిబుల్ ఆర్ సినిమా అని రాజమౌళి చెప్పారు.

ఈ సినిమాకు ఇతర రాష్ట్రాలకు చెందిన టెక్నీషియన్లు ఎక్కువగా పని చేశారని… సినిమాలో టెక్నికల్ వ్యాల్యూస్ కూడా అద్భుతంగా ఉంటాయని ఆయన చెప్పారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news