Moviesచైతన్య లైఫ్ లోకి మరో అమ్మాయి..తెలిసి తెలిసి తప్పు చేస్తున్న కుర్ర...

చైతన్య లైఫ్ లోకి మరో అమ్మాయి..తెలిసి తెలిసి తప్పు చేస్తున్న కుర్ర హీరోయిన్ ..?

టాలీవుడ్ లోనే మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా ఉన్నటువంటి నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. గత నాలుగు నెలలు నుండి ఈ వార్త మారుమ్రొగిపోతుంది. తీసుకుంటున్న వాళ్ళు బాగానే ఉన్నా..పాపం వాళ్లని ఎంతగానో అభిమానించి ఆరధించిన అక్కినేని అభిమానులు మాత్రం డల్ అయిపోయారు. చూడ చక్కటి జంట అయిన చైతయ్న సమంత విడిపోయున్నారు అన్న వార్తనే వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు వాళ్ళు విడాకులు తీసుకోవాల్సిన అమత అవసరం ఏఅంటి..?? అంత పెద్ద గొడవ ఏం జరిగింది..? అంటే దానికి మీడియాలో రకరకాల సమాధానాలు కనిపిస్తున్నాయి కానీ అవి ఏవి నిజమైనవి అని అధికారిక ప్రకటన లేదు.

రీజన్ ఏంటో తెలియదు కానీ మొత్తానికి తమ నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పెట్టేసారు ఈ జంట. దీంతో సమంత నాగ చైతన్య మాజీ మొగుడు పెళ్లాలు అయిపోయారు. ఇక ఈ విషయంలో నాగార్జున సైతం ఏం చేయ లేకపోయారు. వాళ్ల జీవితం వాళ్ళ ఇష్టం మనము ఏం చేయగలం అంటూ చేతులు దులిపేసుకున్నాడు. అంతేకాదు సమంత నాగచైతన్య భార్యగా విడాకులు తీసుకుంటున్న మేము ఆమెని మాఇంట్లో సభ్యురాలు లాగే చూస్తాం అంటూ భారీ డైలాగ్స్ కొట్టారు.

ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఇక్కడనుండి కధ రివర్స్ అయ్యింది. సమంత నాగ చైతన్య పుట్టిన రోజుకు విష్ చేయకపోవడం..ఆ తరువాత వచ్చిన తన కుక్క పిల్ల పుట్టినరోజుకు విష్ చేయడం..ఆ తరువాత రానా కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం వంటివి అక్కినేని అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసాయి. వీడిపోయేటప్పుడు ఫ్రెండ్స్ గా ఉంటాం అన్నాత్రే కానీ ఇప్పుడు విషెస్ కూడా చెప్పలేదంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు సమంతని. కానీ అమ్మడు వాటిని ఏం పట్టించుకోకుండా ఎకంగా ఐటెం సాంగ్ చేస్తూ..టూ హట్ లుక్స్ తో కిల్లింగ్ పర్ ఫామెన్స్ తో చించేసింది.

ఇక నాగచైతన్య విషయానికి వస్తే..విడాకుల తరువాత పెద్దగా బయట కనిపించని చై..బంగార్రజు సినిమా షూటింగ్ టైంలో ఆయన పక్కన నటించిన లెటేస్ట్ సెన్సేషన్ కృతి శెట్టికి దగ్గరైన్నట్లు వార్తలు వస్తున్నాయి. కృతి శెట్టి కూడా చై తో షూటింగ్ లోకెషన్ లో చాలా క్లోజ్ గా మూవ్ అయిన్నట్లు సమాచారం అందుతుంది.

ఇక వీళ్లు సినిమా కోసం అలా చేసారో లేక వీళ్ళ నిజ జీవితంలో కూడా కనెక్ట్ అవుతారో తెలియదు కానీ..చైతన్య లైఫ్ లోకి కొత్త అమ్మాయి ఎంట్రీ అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక కొందరు అయితే కృతి అలాంటి తప్పు చేయదు అంటూ ఆమెను వెనక వేసుకోస్తున్నారు. మరి వీళ్ళ రిలేషన్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news