Movies500మంది భార్యలు ఉన్న “బింబిసార” గురించి ఈ నిజాలు తెలిస్తే షాక్...

500మంది భార్యలు ఉన్న “బింబిసార” గురించి ఈ నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

నందమూరి కళ్యాణ్ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె నిర్మిస్తోన్న చిత్రం ‘బింబిసార’ . ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది. మైథిలాజికల్ టచ్‌తో సాగే ‘బింబిసార’ సినిమా పై అభిమానులకు భారి అంచనాలే ఉన్నాయి. ద‌య‌లేనివాడు, క్రూరుడైన రాజు బింబిసారుడు లుక్‌లో యుద్ధ రంగంలో శ‌త్రు సైనికుల‌ను చంపి వారి శ‌వాల‌పై ఠీవిగా కూర్చున్న క‌ళ్యాణ్ రామ్ లుక్ ఆక‌ట్టుకుంటోంది. తొలిసారిగా క‌ళ్యాణ్ రామ్ ఇలాంటి డిఫరెంట్ పాత్ర‌లో న‌టిస్తుండ‌టంతో పాటు, ఆ పాత్ర లుక్‌, బ్యాక్ డ్రాప్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది.

దీంటొ అసలు బింబిసార అంటే ఎవరు ? చరిత్రలో ఆయన స్థానం ఏమిటి ? అని అందరు గుగుల్‌లో వెతకడం మొదలు పెట్టారు. రీసెర్చ్ చేస్తే అతనో బార్బేరియన్ కింగ్ అని తెలిసింది. క్రీస్తు పూర్వం 558 భ్ఛ్, 491 భ్ఛ్ మధ్య కాలంలో ‘5వ శతాబ్ధం చివరి కాలంలో) బింబిసారుడుని గురించిన ప్రస్తావన ఉంది. మగధ సామ్రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశ రాజు బింబిసారుడు క్రీస్తు పూర్వం 558 లో భట్టియా అనే అధిపతికి జన్మించారు.

15 ఏళ్ల వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆ తర్వాత పాటలీపుత్ర (పాట్నా) రాజధానిగా చేసుకొని పాలించారు.ఆయన మగధ సామ్రాజ్యానికి రాజైన భట్టియా కుమారుడు. ఒక జైన ముని ప్రశాంతతకు ఆకర్షితుడై జైనమతి భక్తుడిగా మారతాడు. ఆయన హర్యంక రాజవంశానికి చెందినవాడు. రాజ్యాధికారం కోసం జరిగిన పోరాటంలో భట్టియా, బ్రహ్మదత్త చేతిలో ఓటమి పాలవుతాడు. మగధ రాజ్య సింహాసనం అధిరోహించడానికి బింబిసారుడి కుమారుడు అజాతశత్రువే ఆయన్ను ఖైదుచేసి, తనకు మొదటి బిడ్డ పుట్టిన తర్వాత విడుదల చేయాలను కున్నప్పటికీ అప్పటికే బింబిసారుడు మరణించారు.

బింబిసారుడు కోసల రాజు మహా కోసల కూతురైన కోసలా దేవిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత లిచ్చావి రాజకుమారి చెల్లన, మద్రా రాజకుమారి క్షేమను వివాహమాడారు. ఈయనకు 500 భార్యలు ఉన్నారని మహావగ్గ వర్ణించారు. ఇక తనదైన తిరుగులేని పాలన అందించిన బింబిసార చివరకు పదవీ వ్యామోహం కలిగిన కన్నకొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోవడం అనేది ఆయన జీవితంలో ఊహించని ఘటన.క‌ళ్యాణ్ రామ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో క్యాథ‌రిన్ ట్రెసా, సంయుక్తా మీన‌న్‌, వ‌రీనా హుస్సేన్ కథానాయికలుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ్‌, చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌గా వ‌ర్క్ చేస్తుండ‌గా ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news