Moviesచనిపోయే గంట ముందు M.S.నారాయణ పేపర్ లో ఏం రాశారో తెలుసా..!

చనిపోయే గంట ముందు M.S.నారాయణ పేపర్ లో ఏం రాశారో తెలుసా..!

మనం సినిమాలో చూసేవి అన్నీ నిజం కాదు. తెర పై హ్యాపీగా నవ్వుతూ కనిపించినా తెర వెనుక మాత్రం వాళ్లు మనలా మనుషులే. మనలా బాధలు ఉంటాయి. ఇక కెమెరా ముందు నవ్వుతూ నటించే నటీనటుల వెనుక తీరని బాధ కూడా ఉంటుంది. ఇంట్లో ఎవరైనా చావుబతుకుల్లో ఉన్నా, ఒకవేళ మరణించినా ఆ బాధను దిగమింగుకొని నటించాల్సిన పరిస్థితి. ముందుగా కాల్షీట్లు ఇచ్చేస్తారు కాబట్టి తమ వల్ల షూటింగ్ మొత్తం క్యాన్సిల్ కాకూడదని ఆలోచించి చాలా మంది నటీనటులు బాధను దిగమింగుకొని షూటింగ్‌లో పాల్గొంటారు. ఇక అలాంటి సన్నివేశాల్లో కూడా నవ్వుతూ నటిస్తారు. అలాంటి వారిలో M S నారాయణ”కూడా ఒక్కారు.

M Sనారాయణ ఎన్నో సినిమాలలో కమెదియన్ గా నటించి..మనల్ని కడుపుబ్బ నివ్వించిన సినీ నటుడు. ఆయన తెర పీ కనిపిస్తే నవ్వని మనిషి అంటూ ఉండరు. అలాంటి ఒక ప్రత్యేకమైన కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు M S నారాయణ. ఇప్పటికి ఈయన నటించిన సినిమాలు టీవీలో వస్తుంటే మనసారా నవ్వుకునే జనం ఎందరో ఉన్నారు. కామెడీ కోసమే ఈయన సినిమాలు చూసేవారు కూడా చాలామంది ఉన్నారు అనడంలో సందేహం లేదు. అంతలా తన కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ వచ్చారు. ఇకపోతే M S నారాయణ చనిపోయేముందు ఓ వ్యక్తిని చూడాలి అనుకున్నారట. ఇదే విషయాన్ని హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇటీవల ఆలీతో సరదాగా షో లో పాల్గొని ఈ విషయాలన్నీ వివరించాడు.

బ్రహ్మానందం మాట్లాడుతూ..”నారాయణకు నాకు మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఆయన నన్ను అన్నయ్య అని ప్రేమగా పిలుస్తాడు. ఎప్పుడూ జోకులు వేసి నవ్విస్తూ ఉంటారు. ఇక ఆయనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఇంకో గంటలో చనిపోతాడు అనగా తన కూతురిని అడిగి పేపర్ పెన్ను తీసుకుని ‘బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది’ అని రాశాడు. అప్పుడు నేను సినిమా షూటింగ్ లో ఉన్నాను.

వాళ్ళ పాప ఫో చేసి ‘నాన్న ఆరోగ్యం బాగాలేదు.. మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అంకుల్ త్వరగా రండి ‘ అని చెప్పింది. వెంటనే అక్కడకు వెళ్లిపోయా. అప్పుడు ఆయన నా చేయి గట్టిగా పట్టుకొని.. అన్నయ్య అంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నాకు అర్థం కాలేదు. చాలా ట్రై చేసే. వాళ్ల అబ్బాయిని పిలిపించి తన వంక, నా వంక అలాగే చూస్తూ ఉన్నాడు. ఆయన బాధ చూడలేక నేను బయటకు వచ్చేశాను. నేను బయటకొచ్చిన 15-20 నిమిషాలకే నారాయణ చనిపోయాడు” అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news