Moviesస్టార్ హీరోయిన్ గా రాజ్యమేలాల్సిన ఈమె కెరీర్ పడిపోవడానికి కారణం ఇదే..!

స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలాల్సిన ఈమె కెరీర్ పడిపోవడానికి కారణం ఇదే..!

సుజాత..ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలనాటి హీరోయిన్స్ లో మేటి నటీమణి. ఇక నిన్నటి మొన్నటి వరకు క్యారెక్టర్ నటి కి కూడా అందరికి బాగా సుపరిచితమే. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో చాలామందికి తల్లిగా నటించి, అలరించిన సుజాత అందరికీ గుర్తుండే ఉంటారు. ఆ తరం అగ్రకథానాయకు లందరి సరసన సుజాత నాయికగా నటించి ఆకట్టుకున్నారు. కేవలం ఏడేళ్ల వ్యవధిలో 40 చిత్రాల్లో నటించింది అంటే అప్పట్లో సుజాత రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

ఆమె పరాయి భాషా నటి అనే స్పృహ తెలుగు ప్రేక్షకులకు లేరు. అంతగా తెలుగు ప్రజలను ఆమె ఆకట్టుకున్నారు. తెలుగులో ఆమె బలమైన పాత్రలను మాత్రమే ఎంచుకున్నారు. హీరో పక్కన రక్తమాంసాలు లేని హీరోయిన్ పాత్రలు ఆమె పోషించలేదు. సినిమాలో హీరోతో పాటు ఆమె పాత్ర కూడా అత్యంత కీలకంగా ఉండేది.

సుజాత 14 యేళ్ళ చిరు ప్రాయంలోనే వెండి తెరకు ఎంట్రీ ఇచ్చి.. బాలచందర్ వంటి దిగ్గజ దర్శకుడి చేతిలో 1974 సంవత్సరంలో ‘అవ్వాలోరు తుధల్ కథై’(తెలుగులో అంతు లేని కథ) అనే తమిళ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇక అప్పటి తమిళ్ స్టార్ హీరోలు అందరితో జత కట్టింది. ఆ తర్వాత తమిళ్, తెలుగు, కన్నడ హిందీ భాషల్లో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించింది.

నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఆమె ఎంచుకున్నారు. గుప్పెడు మనసు, ఏడంతస్థుల మేడ, సర్కస్ రాముడు, గురుశిష్యులు, బంగారు కానుక, శ్రీరామదాసు, ప్రేమతరంగాలు, సూత్రధారులు, పుసుపు పారాణి వంటి పలు హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. తెలుగుకు సంబంధించిన మహిళగా ఆమె గుర్తింపు పొందారు.

ఎందరో మనసులని గెలుచుకున్న నటి సుజాత 2011 వ సంవత్సరంలో మరణించారు. ఇక అప్పట్లో ఆమె మరణ వార్త తెలుగు ప్రేక్షకులను, తెలుగు సినీ పరిశ్రమను కంట తడి పెట్టించింది. సుజాత నటిగానే కాకుండా వ్యక్తిగా కూడా మన్ననలు అందుకున్నారు. ఆమె వ్యక్తిత్వంపై ఏ విధమైన మచ్చ లేదు. నిజానికి ఆమె కి వచ్చినా అన్ని సినిమాలు ఒప్పుకుని ఉంటే ఆమె అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లి ఉండేది. కానీ సుజాత అలా చేయలేదు. కేవలం డబ్బు కోసం కాకుండా..మనకు నచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్లింది. అందుకే ఆమె స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. కానీ అంతటి అభిమానులను సంపాదించుకుని మిగత హీరోయిన్స్ తనను చూసి కుల్లు కునేలా చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news