Moviesనిహారిక‌ను పంది అని ఎవ‌రు పిలుస్తారు.. ఆ బావ అంటే చాలా...

నిహారిక‌ను పంది అని ఎవ‌రు పిలుస్తారు.. ఆ బావ అంటే చాలా ఇష్ట‌మ‌ట‌..!

మెగా డాట‌ర్ నిహారిక అటు సినిమాల‌తో పాటు ఇటు బుల్లితెర‌పై పాపుల‌ర్ హీరోయిన్‌. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. మూడు సినిమాలు తెలుగులో.. త‌మిళ్‌లో ఒక సినిమా చేసింది. ఆ త‌ర్వాత జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌ను పెళ్లి చేసుకుంది. ఇక బుల్లితెర మీద ఓ వైపు సంద‌డి చేస్తూనే మ‌రోవైపు నిర్మాత‌గా మారి వెబ్ సీరిస్‌లు నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది.

ఇక తాజాగా ఆలీతో స‌ర‌దాగా ప్రోగ్రామ్‌కు వ‌చ్చిన నిహారిక ఎన్నో విష‌యాలు షేర్ చేసుకుంది. నిహారిక‌కు ఇంట్లో చాలా పేర్లు ఉన్నాయ‌ట‌. త‌న తండ్రి నాగబాబు ఆమెను అమ్మ అని పిలుస్తారు అంట‌. భ‌ర్త చైత‌న్య నాన్న అని పిలుస్తార‌ట‌. ఇక సోద‌రుడు వ‌రుణ్‌తేజ్ మామూలుగా నిహా, ముద్దు వ‌స్తే బంగారం.. ఇంకా ముద్దు వ‌స్తే పంది అని పిలుస్తాడు అట‌.

త‌మ‌ది ఎరేంజ్‌డ్ మ్యారేజ్ అని.. ప్రేమ వివాహం కానే కాద‌ని ఈ మెగా డాట‌ర్ చెప్పింది. ఇక సాయిధ‌ర‌మ్ తేజ్ గురించి మాట్లాడుతూ త‌న‌కు చాలా క్లోజ్ తేజ్ భావ అని చెప్పింది. తాను, తేజ్ బావ‌, మా చిన్న‌త్త‌, మా నాన్న .. మా న‌లుగురికి కొంచెం మెంట‌ల్ ఉంద‌ని ఒక్క‌సారిగా బాంబు పేల్చింది. ఇంట్లో పార్టీ ఫంక్ష‌న్లు కాని, ఫ్యామిలీ ఫంక్ష‌న్లు కాని ఏమీ ఉన్నా ఫ‌స్ట్ మా న‌లుగురు గొంతులు మాత్ర‌మే వినిపిస్తాయ‌ని నిహారిక చెప్పింది.

ఇక నిహారిక భ‌ర్త ఓన్ బిజినెస్ చేస్తూ ఉంటాడ‌ట‌. నిహారిక అత్త‌వారిల్లు గుంటూరు. గుంటూరులోనే వారు ఉంటారు. నిహారిక మామ పోలీస్ శాఖ‌లో ఉన్న‌తాధికారిగా ప‌నిచేసి రిటైర్ అయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news