Moviesవ‌ర‌ల్డ్ లార్జెస్ట్ ఐమాక్స్ స్క్రీన్‌పై అఖండ రిలీజ్‌

వ‌ర‌ల్డ్ లార్జెస్ట్ ఐమాక్స్ స్క్రీన్‌పై అఖండ రిలీజ్‌

యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ‌ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్లో వచ్చిన సింహా – లెజెండ్ రెండు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు అఖండ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ అంటున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్, టీజ‌ర్లు సినిమాపై అంచనాలను ఆకాశంలో పెట్టేశాయి. ఇక అఖండ ట్రైలర్ రోర్‌ పేరుతో రిలీజ్ అయిన ట్రైలర్ కూడా భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. బాల‌య్య చెప్పిన ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విచిత్రమేంటంటే ఈ సినిమా రిలీజ్ కు మరో పది రోజుల టైం ఉన్నా కూడా బాలయ్య కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా అడ్వాన్స్ బుకింగ్ లు జరుగుతున్నాయి.

యూఎస్ లో కూడా అఖండ జోరు మామూలుగా లేదట. డిసెంబరు 1వ తేదీ నుంచే భారీ ఎత్తున ప్రీమియ‌ర్లు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఆస్ట్రేలియా – సింగపూర్ – అబుదాబిలో కూడా అఖండ ప్రీమియర్ షో లు భారీ ఎత్తున‌ వేస్తున్నారు. ఇక మెల్‌బోర్న్‌లోని వరల్డ్ లార్జెస్ట్ స్క్రీన్ పై అఖండ ప్రీమియ‌ర్ షో వేస్తున్నారు.

ఈ సినిమాకు వ‌స్తోన్న ప్రి రిలీజ్ రెస్సాన్స్‌తో బాలయ్య అభిమానులు కూడా ఖుషి గా ఉన్నారు. ఇక అఖండ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27న శిల్పకళా వేదికలో జరగనుంది. బాల‌య్య స‌ర‌స‌న ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news