MoviesR R R గ్లింప్స్ రివ్యూ... బాహుబ‌లి కంక్లూజ‌న్‌కు బాబులా ఉందిరా......

R R R గ్లింప్స్ రివ్యూ… బాహుబ‌లి కంక్లూజ‌న్‌కు బాబులా ఉందిరా… (వీడియో)

టాలీవుడ్ ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? అని భార‌తీయ సినీ ప్రేక్ష‌కులు రెండున్న‌రేళ్లుగా ఎంత ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారో చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌తిసారి రాజ‌మౌళి ఏదో ఒక సాకు చూపి సినిమాను వాయిదా వేస్తూ వ‌స్తున్నారు. చివ‌ర‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ట్రైల‌ర్‌కు కూడా దిక్కులేదు. ఈ రోజు ఎట్ట‌కేల‌కు 45 సెక‌న్ల నిడివి ఉన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు. అస‌లు బాహుబ‌లి రెండు సినిమాల త‌ర్వాత రాజ‌మౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌డం ఓ సంచ‌ల‌నం అయితే.. తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా రామ్‌చ‌ర‌ణ్ – ఎన్టీఆర్ కాంబినేష‌న్ సెట్ చేశారు.

ఇక ఈ రోజు రిలీజ్ అయిన గ్లింప్స్ అయితే మైండ్ పోయేలా ఉంది. అస‌లు రెండు క‌ళ్లు ప‌దే ప‌దే ఆ వీడియోను చూస్తున్నా కూడా ఇంకా ఏదో మిస్ అయిపోతున్నాం అన్నంత‌గా ప్ర‌తి షాట్ క‌ట్ చేశారు. అస‌లు ఈ సినిమా కోసం ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తోన్న అభిమానుల ఆక‌లిని ఈ గ్లింప్స్ తీర్చేసింది. ఎన్టీఆర్ – చ‌ర‌ణ్ ఇద్ద‌రు ఎంట్రీ తో పాటు అజ‌య్‌దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్ లుక్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి.

ఇక యాక్ష‌న్ తో పాటు హైలెవ‌ల్ టెక్నిక‌ల్ వాల్యూస్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ విజువ‌ల్స్ గురించి చెప్ప‌డం క‌న్నా అస‌లు సినిమా ఎప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? అని ఉత్కంఠ‌తో వెయిట్ చేసేలా ఉంది. రాజ‌మౌళి క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేద‌ని గ్లింప్సే చెప్పేస్తోంది. రేపు ట్రైల‌ర్ తో ఇంకెంత ర‌చ్చ క్రియేట్ చేస్తాడో ? చూడాల‌ని అప్పుడే ఆస‌క్తి నెల‌కొంది. ఏదేమైనా ఆర్ ఆర్ ఆర్ బాహుబ‌లికి బాబులా ఉంటుంద‌ని క్లారిటీ అయితే వ‌చ్చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news