Moviesఅమీర్‌పేట రైడింగ్‌లో దొరికింది శ్వేత ఒక్క‌టే... పారిపోయిన ఆ ఇద్ద‌రు హీరోయిన్లు...

అమీర్‌పేట రైడింగ్‌లో దొరికింది శ్వేత ఒక్క‌టే… పారిపోయిన ఆ ఇద్ద‌రు హీరోయిన్లు ?

సినిమాల్లో న‌టించాల‌న్న కోరిక‌తో ఎంతో మంది అమ్మాయిలు ఇక్క‌డ‌కు వ‌స్తారు. ఈ రంగుల ప్ర‌పంచంలో ఓ వెలుగు వెలిగి పోవాల‌న్న కోరిక చాలా మందికే ఉంటుంది. అయితే ఇక్క‌డ అమ్మాయిల‌కు అంత త్వ‌ర‌గా అవ‌కాశాలు రావు. చాలా విష‌యాల్లో కాంప్ర‌మైజ్ కావాల్సి ఉంటుంది. ఇక హీరోయిన్లుగా అవ‌కాశాలు పోయాక కొంద‌రు డ‌బ్బుల కోసం ప‌క్క దారి ప‌డుతూ ఉంటారు. అయితే కొంద‌రు స్టార్ హీరోయిన్లు కూడా మ‌రింత డ‌బ్బు కోసం పాడు ప‌నులు చేస్తూ ఉంటారు.

అమీర్‌పేట‌లో జ‌రిగిన రైడింగ్‌లో వ‌ర్థ‌మాన హీరోయిన్ శ్వేతా బ‌సు ప్ర‌సాద్ వ్య‌భిచారం చేస్తూ పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయింద‌న్న టాక్ తెలిసిందే. అయితే అదే రోజు అదే స్పాట్‌లో మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లు కూడా వ్య‌భిచారం చేస్తూ పోలీసుల‌కు ప‌ట్టు బ‌డ్డార‌న్న‌ది కూడా ఇంట‌స్ట్రీలో టాక్‌. అయితే ఆ ఇద్ద‌రు హీరోయిన్లు అక్క‌డ నుంచి తృటిలో ఎస్కేప్ అయ్యార‌ట‌. పోలీసులు వ‌స్తున్నార‌న్న విష‌యం తెలియ‌డంతో వారు అక్క‌డ నుంచి త‌ప్పించుకున్న వెంట‌నే పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు.

అయితే శ్వేతా బ‌సు మాత్రం ఇరుక్కుపోయింది. ఇక అక్క‌డ నుంచి త‌ప్పించుకున్న ఇద్ద‌రు స్టార్ హీరోయిన్ల పీఏలు ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌కుండా చాలా తెలివిగా మేనేజ్ చేశార‌ట‌. ఆ ఇద్ద‌రిలో ఒక‌రు తెలుగు మూలాలు ఉన్న స్టార్ హీరోయిన్‌. ఆమె ప‌లువురు స్టార్ హీరోల‌తో ఇక్క‌డ న‌టించ‌డంతో పాటు కోలీవుడ్‌లో కూడా ఓ వెలుగు వెలిగింది.

ఇక మ‌రో హీరోయిన్ స్టార్ హీరోయిన్‌గా ఎన్నో హిట్ సినిమాల్లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు చేసింది. ప‌దిహేనేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉంటోంది. ఇప్ప‌ట‌కి పెళ్లి కాలేదు. అయితే వారు వారి ప‌లుకుబ‌డి ఉప‌యోగించుకుని త‌ప్పించుకుంటే శ్వేత మాత్రం దొరికిపోయింద‌ని అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news