Moviesచిరంజీవి చేసిన పని నాకు అసలు నచ్చలేదు..రాజమౌళి సంచలన వ్యాఖ్యలు ..!!

చిరంజీవి చేసిన పని నాకు అసలు నచ్చలేదు..రాజమౌళి సంచలన వ్యాఖ్యలు ..!!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ సినీ ప్రస్దానంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నారు. ఎంతో మంది యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలిచారు చిరు. రీ ఎంట్రీలో కూడా వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ యంగ్ హీరోలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తూ దూసుకు పోతున్నారు. ప్ర‌స్తుతం చిరు చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు-ఆరు సినిమాలు ఉన్నాయంటే ఆయన ఫాలోయింగ్ ఎలాంటిదో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక చిరంజీవి నటించిన అన్నీ సినిమాలు ఆల్ మోస్ట్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన ఆయన నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

అయితే తాజాగా రాజమౌళి మెగస్టార్ చిరంజీవి పై షాకింగ్ కామెంట్స్ చేసారు. రీసెంట్ గా RRR సినిమా ప్రమోషన్స్ లో భాగంగ ఆయన ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ.. చిరంజీవి హీరోగా నటించిన కొదమ సింహం లోని ఓ సీన్ పై త‌న అభిప్రాయ‌న్ని షేర్ చేసుకున్నాడు. ఇక చిరు న‌టించిన అన్ని సినిమాల్లో కొన్ని త‌న‌కు బాగా న‌చ్చుతాయ‌ని చెప్పిన ఆయన. అయితే కొదమ సింహం సినిమాలో ఓ సీన్ లో చిరంజీవిని ఇసుకలో మొత్తం కప్పేస్తారు.

కేవలం తల మాత్రమే బయటకు కనపడేలా ఉంటుంది. అప్పుడు ఓ గుర్రం వచ్చి ఆయనని కాపాడుతుంది. కానీ చిరంజీవి బయటకు వచ్చాక ఆ గుర్రం ని అసలు పట్టించుకోరు. తన ప్రాణాలను కాపాడిన గుర్రాని అలా వదిలేయడం తనకు అసలు నచ్చలేదని చెప్పుకోచ్చారు రాజమౌళి . అయితే ఆ తరువాత ఇందులో చిరంజీవి గారి తప్పు ఏం లేదు..డైరెక్టర్ ఎలా చెప్పితే ఆయన అలా చేసారు అంటూ కవర్ చేసారు. దీంతో ఈయన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. దీని పై నెటిజన్స్ భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈయన డైరెక్ట్ చేసిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతి పండుగ సంధర్భంగా జనవరి 7న ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news