Moviesటంగ్ స్లిప్ అయిన నిహారిక..ఏకిపారేస్తున్న నెటిజన్స్..!!

టంగ్ స్లిప్ అయిన నిహారిక..ఏకిపారేస్తున్న నెటిజన్స్..!!

మెగా డాటర్‌ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడు చక్కగా నవ్వుతూ..అందరిని నవ్విస్తూ ఉంటుంది. కొణిదెల ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొన్ని సినిమాలు..వెబ్ సిరీస్ లు చేసినా..వాటిలో ఒక్కటి అంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు కదా..కనీసం పాజిటివ్ టాక్ ను కూడా సొంతం చేసుకోలేక పోయాయి. దీంతో నిహారిక సినీ కెరీర్ నిగ్ ఫెయిల్యూర్ రిజల్ట్ అందుకుంది. మెగా డాటర్ గా సినిమాలు చూసిని అభిమానులు నిహారిక ఇక సినిమాల్లో నటించడం మానేస్తే బెటర్ అని కూడా అన్నారు. ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి హ్యాపీగా పెళ్లి చేసునేసింది ఈ అమ్మడు.

అయితే. తాజాగా ఈటీవీలో ప్రసారమైయ్యే ఆలీతో సరదాగా షోకి గెస్ట్ గా వచ్చింది నిహారిక. నవంబర్ 22న బుల్లితెరపై ఈ షో ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ప్రోమో వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఆలీతో నిహారిక చెప్పిన సరదా సంగతులు మెగా అభిమానులను ఫిదా చేశాయి. ముఖ్యంగా తన ఫ్యామిలీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. హోస్ట్ ఆలీ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిలో నీకు ఎవరు ఎక్కువ ఇష్టం అని అడగ్గా..దాని పై ఆసక్తికర ఆన్సర్ ఇచ్చిన్నత్లు తెలుస్తుంది. అంతేకాదు ‘నాన్న లేకుంటే చచ్చిపోతా’ అంటూ నాగబాబు అంటేనే తనకు చాలా చాలా ఇష్టమని చెప్పడం మనం ప్రోమోలో చూడవచ్చు. ఆలీ:మీ నాన్న మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టారా?’ అని అడిగితే.. దీంతో చిన్నప్పుడు ఓ విషయంలో వీపుపై ఒక్కటేశాడని చెప్పుకొచ్చింది నిహారిక.

ఇక ఇది ఇలా ఉంతే షో లోకి ఎంటర్ అయ్యే ముందు నిహారిక కోసం ‘నిహారికా నిహారికా నువ్వే..’ అనే సాంగ్‌ని వేసారు. అంత బాగానే ఉన్నా..ఇక్కడే అమ్మడు పప్పులో కాళ్లు వేసింది. ఆలీ వచ్చి ఈ పాట నువ్వు పుట్టిన తరువాత రాశారంటావా? లేక నిన్ను చూసిన తరువాత పాడారంటావా? అని అడగ్గ. నిహారిక రిప్లై ఇస్తూ “ఏమో అది నాకు తెలియదు కానీ.. దేవి శ్రీ ప్రసాద్ గారు నా కోసమే ఈ పాట రాశారని నేనైతే ఫిక్స్ అయిపోయా. ఏ షోకి వెళ్లినా ఈ పాట తమన్నాకి కూడా ప్లే చేస్తారో ఏమో కానీ.. నాకైతే ఇదే పాట వేస్తారు అని చెప్పింది నిహారిక. ఇక ఇక్కడే అడ్డంగా దొరికిపోయింది నిహారిక. నిజానికి ఈ పాట రాసింది అనంత్ శ్రీరామ్..దేవి శ్రీ ప్రసాద్ రాయలేదు.. ట్యూన్ చేశారు. దీంతో నిహారికను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news