Moviesఐశ్వ‌ర్యారాయ్ గురించి మీకు తెలియ‌ని టాప్ సీక్రెట్స్ ఇవే..!

ఐశ్వ‌ర్యారాయ్ గురించి మీకు తెలియ‌ని టాప్ సీక్రెట్స్ ఇవే..!

నీలి క‌ళ్ల సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్… ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది క‌ళ‌ల ఆధార్య దేవ‌త‌. క‌ర్నాట‌క‌లోని మంగుళూరులో పుట్టిన ఐశ్వ‌ర్య చిన్న వ‌య‌స్సులోనే మోడ‌లింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమీర్‌ఖాన్‌తో ఆమె చేసిన పెప్సీ యాడ్ హిట్ట‌వ్వ‌డంతో ఆమెకు మంచి పేరు వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆమె మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఇరువ‌ర్ ( ఇద్ద‌రు) సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.

1995లో ఆమె మిస్ వ‌ర‌ల్డ్ కిరీటం సొంతం చేసుకుంది. అదే సంవ‌త్స‌రం సుస్మితా సేన్ మిస్ యూనివ‌ర్స్ అయ్యింది. ఇక ఐశ్వ‌ర్యారాయ్ గురించి.. ఆమె ఇష్టాఇష్టాల గురించి కొన్ని విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

– 1942లో వ‌చ్చిన కాసాబ్లాంకా సినిమా అంటే ఐష్‌కు ఎంతో ఇష్టం అట‌. ఇది ఆమెకు ఆల్ టైం ఫేవ‌రెట్ మూవీ
– ఐష్‌కు వాచ్‌లంటే పిచ్చి.. కొత్త‌గా వ‌చ్చిన కంపెనీల వాచ్‌ల‌న్ని కొనేస్తుంటుంది. అలాగే ఆమెకు బంగారు ఆభ‌ర‌ణాలు అన్నా ఇష్ట‌మే.
– ఐశ్వ‌ర్య‌కు విదేశాల్లో కూడా అభిమానులు కోట్లాది మంది ఉన్నారు. జోధా అక్బ‌ర్ లో ఆమె క్యారెక్ట‌ర్ ఆధారంగా బార్బీ బొమ్మ‌లు త‌యారు చేస్తే నిమిషాల్లో హాట్ కేకుల్లా కొనేశారు. ఇది లండ‌న్‌లో జ‌రిగింది.

– ర‌జ‌నీతో న‌టించాల‌న్న ఆమె కోరిక రోబో సినిమాతో తీరింది.
– రాజా హిందుస్థానిలో ముందు అనుకున్న హీరోయిన్ ఆమే. ఆమె త‌ప్పుకోవ‌డంతో ఆ సినిమాలో క‌రిష్మా క‌పూర్ హీరోయిన్‌గా చేసింది.
– 2007లో ఆమె బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కుమారుడు అభిషేక్‌ను పెళ్లాడింది. వీరికి 2011లో ఆరాధ్య జ‌న్మించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news