Movies'అఖండ ' రిలీజ్‌పై ఫ్యీజులు ఎగిరే న్యూస్ వ‌చ్చేసింది..!

‘అఖండ ‘ రిలీజ్‌పై ఫ్యీజులు ఎగిరే న్యూస్ వ‌చ్చేసింది..!

యువ‌ర‌త్న‌, నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా తెర‌కెక్కుతోన్న సినిమా అఖండ‌. మాస్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బ‌డ్జెట్ సినిమా యేడాదిన్న‌ర కాలంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు.

బాల‌య్య – బోయ‌పాటి కాంబినేష‌న్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన సింహా, లెజెండ్ రెండూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు అయ్యాయి. దీంతో వీరి కాంబోలో వ‌స్తోన్న అఖండ హ్యాట్రిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ సెంటిమెంట్ రిపీట్ చేస్తుంద‌ని అంటున్నారు. ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేస్తార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా రిలీజ్ డేట్ రాలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ గురించి ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ సినిమాను ముందుగా డిసెంబ‌ర్ 2న రిలీజ్ చేస్తార‌ని ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు మ‌రో డేట్ కూడా వినిపిస్తోంది.. అదే జ‌న‌వ‌రి 12. అయితే సంక్రాంతికి విప‌రీత‌మైన పోటీ ఉంది. ఈ సినిమా నిర్మాత‌లు అంత రిస్క్ చేస్తారా ? అన్న‌ది చూడాలి. మిర్యాల ర‌వీందర్ రెడ్డి ఈ సినిమాను రు. 60 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news