Moviesత‌ల్లీ, కూతురు ఒకేసారి టాలీవుడ్‌లో ర‌చ్చ లేపుతున్నారుగా...!

త‌ల్లీ, కూతురు ఒకేసారి టాలీవుడ్‌లో ర‌చ్చ లేపుతున్నారుగా…!

రెండున్న‌ర ద‌శాబ్దాల క్రింద‌ట ఒకే ఒక్క సినిమాతో యావ‌త్ దేశాన్ని ఊపేసింది భాగ్య శ్రీ. తెలుగులో వ‌చ్చిన ప్రేమ పావురాలు (హిందీలో మైనే ప్యార్ కియా) సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది. అప్ప‌ట్లో ఆమె అంద‌చందాల‌తో కుర్ర‌కారుకు పిచ్చెక్కించేసింది. ఆ త‌ర్వాత ఆమె సినిమాలు వ‌దిలేసి అమెరికాకు చెందిన ఎన్నారైను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఆమె వెండితెర‌పై రీ ఎంట్రీ ఇవ్వ‌డంతో పాటు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రాధే శ్యామ్ సినిమాలో ప్ర‌భాస్‌కు త‌ల్లిగా న‌టిస్తోంది.

కెరీర్‌లో ఫామ్‌లో ఉండ‌గానే ఆమె మంచి ఛాన్సులు వ‌దులుకుంది. దీంతో ఆమె కెరీర్ దెబ్బ‌తింది. దీంతో ఆమె త‌న కూతురు విష‌యంలో ఈ త‌ప్పు చేయ‌కూడ‌ద‌ని డిసైడ్ అయిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది. త‌న కుమార్తె అవంతికిను టాలీవుడ్‌కు అప్పుడే హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేసేస్తోంది. బెల్లంకొండ గ‌ణేష్ హీరోగా వ‌స్తోన్న సినిమాలో అవంతిక హీరోయిన్‌గా వెండితెర‌కు ప‌రిచ‌యం కాబోతోంది.

స‌తీష్ వేగేశ్న ఈ సినిమాకు నిర్మాత‌. అచ్చం త‌ల్లి భాగ్య శ్రీ పోలిక‌ల‌ను పుణికి పుచ్చుకున్న అవంతిక మ‌రి న‌ట‌న‌లో త‌ల్లిని మైమ‌ర‌పిస్తుందో ? లేదో ? చూడాలి. ఇక అటు రాధే శ్యామ్‌తో తల్లి భాగ్య శ్రీ, ఇటు గ‌ణేష్ సినిమాతో కూతురు అవంతికి ఒకేసారి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. మ‌రి అవంతిక టాలీవుడ్‌లో స‌క్సెస్ అయ్యాక‌.. బాలీవుడ్‌పై కాన్‌సంట్రేష‌న్ చేస్తుందా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news