Moviesమెగాస్టార్ చిరు లిప్‌లాక్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవ‌రో తెలుసా..!

మెగాస్టార్ చిరు లిప్‌లాక్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవ‌రో తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి లాంగ్ గ్యాప్ తీసుకుని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా కూడా దూసుకు పోతున్నారు. ఖైదీ నెంబ‌ర్ 150తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన చిరు సైరాతో త‌న స‌త్తా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ఫ్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు చిరు చేతిలో ఆచార్య త‌ర్వాత కూడా నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయి. భోళా శంక‌ర్‌, గాడ్ ఫాద‌ర్‌, బాబీ సినిమా ఉన్నాయి. ఇదిలా ఉంటే చిరు త‌న కెరీర్‌లో ఏకంగా 150 కు పైగా సినిమాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.

చిరు ఎంతో మంది హీరోయిన్ల‌తో న‌టించారు. చిరుతో న‌టించిన హీరోయిన్ల సంఖ్య ప‌దుల సంఖ్య‌లోనే ఉంటుంది. లేడీ అమితాబ‌చ్చ‌న్ విజ‌య‌శాంతి, రాధ, రాధిక‌, సుహాసిని, సిమ్రాన్‌, ఆర్తీ అగ‌ర్వాల్‌, సోనాలి బింద్రే, సంఘ‌వి, త‌మ‌న్నా, న‌య‌న‌తార ఇలా చెప్పుకుంటూ పోతే నాటి త‌రం నుంచి నేటి త‌రం వ‌ర‌కు ఎంతో మందితో చిరు న‌టించారు. చిరుతో న‌టించాల‌ని ఎంతో మంది హీరోయిన్లు క‌ల‌లూ కంటూ ఉంటారు.

ఆయ‌న ప‌క్క‌న ఒక్క ఛాన్స్ వ‌స్తే చాల‌ని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక చిరు ఎంత‌మంది హీరోయిన్ల‌తో న‌టించినా కూడా ఆయ‌న ఏ హీరోయిన్‌కు కూడా లిప్ లాక్ ఇవ్వ‌లేదు.. అయితే ఇందుకు ఒక్క హీరోయిన్ మాత్ర‌మే మిన‌హాయింపు త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల్లో ఓ సీన్‌లో మాత్రం చిరు ఆ హీరోయిన్‌కు లిప్‌లాక్ పెట్టాల్సి వ‌చ్చింద‌ట‌. ఆమె ఎవ‌రో కాదు న‌గ్మా. ఘ‌రానామొగుడు సినిమాలో కె.రాఘ‌వేంద్ర‌రావు పండు పండు సాంగ్ కోసం ప‌ట్టుబ‌ట్టి మ‌రీ లిప్ కిస్ పెట్టించాడ‌ట‌.

చిరంజీవి నా వ‌ల్ల కాదు అని చెప్పినా కూడా రాఘ‌వేంద్ర‌రావు కుద‌ర‌ని చెప్ప‌డంతో చిరు అయిష్టంగానే న‌గ్మాకు లిప్ లాక్ పెట్టాడ‌ట‌. అయితే ఆ త‌ర్వాత చిరుకు ఆ సీన్ ఎందుకో న‌చ్చ‌క‌పోవ‌డంతో ఎడిటింగ్‌లో క‌ట్ చేయించేశార‌ట‌. అలా చిరు లిప్‌లాక్ సీన్ చూసే ఛాన్స్ మ‌నం మిస్ అయిపోయాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news