Moviesభార్య‌ల‌కు విడాకులు ఇచ్చేందుకు కోట్లు భ‌ర‌ణం క‌ట్టిన స్టార్స్ వీళ్లే..!

భార్య‌ల‌కు విడాకులు ఇచ్చేందుకు కోట్లు భ‌ర‌ణం క‌ట్టిన స్టార్స్ వీళ్లే..!

సినిమా ఇండ‌స్ట్రీలో ప్రేమ‌లు, పెళ్లిళ్లు, పెటాకులు అనేవి ఇప్పుడు కామ‌న్ అయిపోయాయి. పెళ్లికి ముందు ఎంతో అన్యోన్యంగా ప్రేమించుకున్న‌ట్టే ఉంటారు. చిన్న కార‌ణాల‌తోనే బ్రేక‌ప్ చెప్పేసుకుంటారు. ఇక చాలా మంది స్టార్ హీరోలు తాము ఎంతో అన్యోన్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య‌ల‌కు త‌ర్వాత అనేక కార‌ణాల‌తో విడాకులు ఇచ్చారు. భార్య‌ల‌కు విడాకులు ఇచ్చాక వీరు వారికి కోట్లాది రూపాయ‌లు భ‌ర‌ణం ఇచ్చారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్ అన్న తేడా లేకుండా ఎంతో మంది హీరోలు భార్య‌ల‌కు కోట్ల రూపాయ‌లు భ‌ర‌ణం ఇచ్చారు. ఈ లిస్టులో ఉన్న హీరోల గురించి ఓ లుక్కేద్దాం.

సంజయ్ కపూర్ – కరిష్మా కపూర్:
బాలీవుడ్‌ను 1990వ ద‌శ‌కంలో క‌రిష్మా క‌పూర్ ఓ ఊపు ఊపేసింది. ఆ త‌ర్వాత సంజ‌య్ క‌పూర్‌ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక విడాకులు తీసుకుంది. అయితే సంజ‌య్ క‌రిష్మాకు భ‌ర‌ణం రూపంలో రు. 11 కోట్ల‌తో వెహిక‌ల్స్ ఇచ్చాడ‌ట‌. ఇక ముంబైలో ఓ ఖ‌రీదైన ఇళ్లు కూడా ఇచ్చాడ‌ట‌.

ప్రభుదేవా – ర‌మ‌లత్:
స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, ద‌ర్శ‌కుడు ప్ర‌భుదేవా కేవ‌లం న‌య‌న‌తార‌ను పెళ్లి చేసుకునేందుకే త‌న భార్య ర‌మ‌ల‌త్‌కు విడాకులు ఇచ్చాడు. అప్పుడు ఆమెకు ఖ‌రీదైన రెండు కార్ల‌తో పాటు రు. 25 కోట్ల విలువైన ఆస్తులు ఆమె పేర రిజిస్ట‌ర్ చేశాడ‌ట‌.

హృతిక్ రోషన్ – సుస్సాన్ ఖాన్:
హృతిక్ రోషన్ కూడా తన చిన్న‌నాటి స్నేహితురాలు సుసానే ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో విడాకులు తీసుకున్నారు. అప్ప‌టికే వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు. హృతిక్ సుసానేకు రు. 5 కోట్ల విలువైన ఆస్తులు ఇవ్వ‌డంతో పాటు త‌న ఆస్తిలో పిల్ల‌ల‌కు కూడా వాటా ఉండేలా పంప‌కాలు జ‌రిగాయ‌ట‌.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – నందిని:
ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న మొద‌టి భార్య నందినికి రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నాక అధికారికంగా విడాకులు ఇచ్చాడు. ఆమెకు అప్ప‌ట్లోనే రు. కోటి విలువైన పంప‌కాలు జ‌రిగాయ‌ట‌.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రేణు దేశాయ్‌:
ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న రెండో భార్య రేణు దేశాయ్‌కు కూడా భారీ మొత్త‌మే భ‌ర‌ణంగా ఇచ్చాడ‌ట‌. అయితే ఈ మొత్తం ఎంత‌న్న‌ది తెలియ‌క‌పోయినా వీరి ఇద్ద‌రు పిల్ల‌ల పేర కోట్లాది రూపాయ‌ల ఆస్తులు అయితే రిజిస్ట‌ర్ చేసిన‌ట్టు టాక్ ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news