Newsకుక్క హెయిర్ డై కోసం అన్నీ లక్షలా..ఏంటి ఈ కర్మ..!!

కుక్క హెయిర్ డై కోసం అన్నీ లక్షలా..ఏంటి ఈ కర్మ..!!

ఈ రోజుల్లో చాలామంది కుక్కలను పెంచుకుంటున్నారు. అంతే కాదు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. చాలా మందికి కుక్క పిల్లలు అంటే ఇష్టం ఉంటుంది. వాటిని తెచ్చుకుని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. మరి కొందరు అయితే సొంత బిడ్డలాగనే ట్రీట్ చేస్తారు. ఇక మనుషుల మీద చూపించిన ప్రేమ కంటే ఎక్కువగా కుక్కల మీద ఎక్కువ ప్రేమ చూపించే సంఘటనలు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో అయితే కుక్కలకి మనుషులకు మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అంతేనా వాటి కోసం లక్షలు లక్షలు ఖర్చు కూడా చేస్తున్నారు.

పూర్తి వివరాళ్లోకి వెళ్లితే.. రష్యాకు చెందిన ప్లేబాయ్ మోడల్ అన్నా స్టూపక్ తన పెంపుడు కుక్కకు ఫోటో షూట్ చేయాలనుకుంది. అంత వరకు బాగానే ఉంది. కానీ ఇందుకోసం తన కుక్క పిల్ల కలర్ మార్చేసింది. తన కుక్క పిల్ల ఒంటిమీదున్న వెంట్రుకలకు డై కూడా చేయించింది. దీని కోసం ఆమె ఎన్ని లక్షలు ఖర్చు చేసిందో తెలిస్తే..షాక్ అవ్వడం ఖాయం. ఇందు కోసం ఆమె ఏకంగా రూ. 5వేల యూరోలు అంటే సుమారు మన కరెన్సీలో 5 లక్షల రూపాయలను ఖర్చు చేసిందనమాట.

ఇక ఇదే విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇంకేముంది మోడల్ చేసిన పనికి ఆమెపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. నెటిజన్లకు కోపం వస్తే ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవును ఎప్పటి లాగే ఆమెను సోషల్‌ మీడియాలో ఆడేసుకున్నారు. ఫోటో షూట్ పేరుతో జంతువులను హింసించడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే నీకు మెంటల్ నా ..అని కూడా అదుగుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Anna Stupak (@anna3.0.5)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news