MoviesBigg Boss 5: ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్...

Bigg Boss 5: ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసా ?

రోజు రోజుకి బిగ్ బాస్ సీజన్ 5 ఇంట్రెస్టింగా ఉంటుంది. అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న రియాల్టీ షో గా బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో రసవత్తరంగా కొనసాగుతుంది. యూట్యూబ్ లో అలా ప్రోమో పెట్టారో లేదో దానిని చూసే వారి సంఖ్య ఎక్కువైపోతుంది. కొన్ని గంటల్లోనే ప్రోమోకే మిలియన్ల వ్యూస్ వస్తున్నాయంటే ఈ సారి బిగ్ బాస్ సీజన్ 5 కి బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మొత్తం 19 మందితో మొదలైన ఈ షో లో..ప్రతి వారం ఒక్కోక్కరు ఎలిమినేట్ అవుతూ వస్తూ ఫైనల్ గా ఇప్పుడు 10 మందికి వచ్చారు.

ఇక ఈ వారం ఏ కాంటెస్టెంట్ ఎలిమినాట్ అవతారో అన్ని ప్రేక్షకులు ఊహించలేనంత రసవత్తరంగా సాగుతుంది బిగ్ బాస్ షో. ఇక ఈ వారం హౌస్ కెప్టేన్ అయిన రవి మినహా.. మిగతా 8 మంది నామినేషన్‌లో ఉండడ గమనార్హం. ఇక సోషల్ మీడియాలో అయితే నామినేషన్‌ జరిగిన మరుసటి రోజు నుంచే యానీ మాస్టర్ వెళ్లిపోతుందంటూ ప్రచారం జరుగుతుంది. ఇక కొన్ని పోల్స్‌లోనూ యానీ మాస్టర్ చివరి స్థానంలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి.

కాగా తాజాగా లీకువీరులు నుంచి అందుతున్న సమాచారం మేరకు సోషల్ మీడియాలో వచ్చే వార్తే నిజమైంది. యానీ మాస్టర్‌ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్‌ అయిందని తెలుస్తుంది. మొదటి నుంచీ ఓటింగ్‌లో వెనకబడిన యానీ మాస్టర్ కి కాజల్ కి గ హౌస్ లో పడడంలేదు. యానీ ఆమెను వెక్కిరిస్తూ కామెంట్ లు చేయడం ఆమెకు నెగిటివ్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ఇక ఓటింగ్ పరంగా యానీ మాస్టార్ కి తక్కువ ఓట్లో పోల్ అవ్వడం వల్ల యానీ బిగ్‌బాస్‌ షో నుంచి బయటకు వచ్చిందన్న వార్త వైరల్ గా మారింది. కాజల్‌ను నాగిని అంటూ ఆమె ముందు కుప్పిగంతులు వేసిన యానీ రేపు ఎలిమినేట్ అయ్యి కాజల్ ను ఏం అంటుందో అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి రేపు ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news