Moviesఈ వయసులో ముసలోడికి అది అవసరమా..? కమల్ హాసన్ పై మండిపడుతున్న...

ఈ వయసులో ముసలోడికి అది అవసరమా..? కమల్ హాసన్ పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఏమైందంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అనేది ఎలా పెరిగిపోయిందో మనం చూస్తున్నాం. అది చిన్న కాదు పెద్ద కాదు వయసుతో సంబంధం లేకుండా స్టార్ సెలబ్రిటీస్ అందరిని ఓ రేంజ్ లో ట్రోలింగ్కి గురి చేయడానికి ఆకతాయిలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేసే స్టార్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉండే అందరి స్టార్ హీరోలను స్టార్ సెలబ్రెటీలను బాగా ట్రోల్ చేస్తున్నారు ఈ మీమర్స్ -ట్రోలర్స్ -ఆకతాయిలు.

కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. అది కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న కమల్ హాసన్ కి సంబంధించిన న్యూస్ కావడంతో ఈ వార్త ని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. మనకు తెలిసింది కమల్ హాసన్ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ . ఎటువంటి పాత్రలను అయినా సరే అవలీలగా నటించగలరు . ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . ప్రెసెంట్ ఆయన సీనియర్ పాత్రలను పోషిస్తున్నారు . రెబెల్ స్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న కల్కి సినిమాలో కూడా ఆయన కీలకపాత్రలో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో అమితాబచ్చన్ కూడా నటిస్తూ ఉండడం గమనార్హం . కాగా ఈ సినిమా కోసం కమల్ హాసన్ హ్యూజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తుంది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 కోట్లు పుచ్చుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఈ సినిమా కోసం స్టార్ హీరో అయిన ప్రభాస్ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట . అమితాబచ్చన్ కేవలం 10 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ ఛార్జ్ చేశాడట.

అయితే హీరోనే వంద కోట్లు తీసుకున్నప్పుడు జస్ట్ కేమియో రోల్ చేసే నువ్వు .. అది కూడా ముసలోడివి.. నీకు ఇంత రెమ్యూనరేషన్ అవసరమా అంటూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు . మరికొందరు మాత్రం ఆయన ఇష్టం ఆయన ఏమైనా చేసుకుంటాడు.. నీకెందుకు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . కొందరు ఆయన వయసు కూడా మర్చిపోయి వెటకారంగా ట్రోల్ చేస్తూ ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news