Moviesరాజమౌళి స‌ల్మాన్‌ఖాన్‌ ను కలిసింది అందుకేనా..ఇంకేదో అనుకున్నామే..!!

రాజమౌళి స‌ల్మాన్‌ఖాన్‌ ను కలిసింది అందుకేనా..ఇంకేదో అనుకున్నామే..!!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఇప్పుడు ఏం చేసిన అది హాట్ టాపిక్ గానే కనిపిస్తుంది. అందరు ఆయననే గ‌మ‌నిస్తున్నారు. అందుకు కార‌ణం.. ఆయ‌న డైరెక్ష‌న్‌లో రాబోతున్న RRR మూవీ. టాలీవుడ్‌తో పాటు యావత్‌ చిత్ర పరిశ్రమ దృష్టంతా ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంపైనే ఉంది. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, ఒలీవియా మోరీస్‌, అలియాభట్‌, శ్రియా శరణ్‌ లాంటి స్టార్స్‌ ఈ సినిమాలో నటిస్తుండడంతో సినీ ప్రియులందరూ ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో రాబోతున్న చిత్రం కావడంతో ప్రజలు భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు. దీంతో అంద‌రూ అటెన్ష‌న్‌గా వెయిట్ చేస్తున్నారు.

మ‌రో వైపు సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో రాజ‌మౌళి సినిమా ప్రమోషన్స్ పనులని చక చక చేస్తున్నారు. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేస్తూనే, ప్ర‌మోష‌న్స్ ప్లానింగ్‌తో సినిమాకు హైప్ క్రియేట్ చేస్తున్నాడు మన జక్కన. ఈ క్రమంలో ముంబై వెళ్లారు రాజముళి. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్‌ను మ‌న ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌త్యేకంగా కలవడానికే ఆయన ముంబై వెళ్లారట.దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అంత ప్ర‌త్యేకంగా స‌ల్లూ భాయ్‌ను జ‌క్క‌న్న ఎందుకు కలిశాడ‌నేది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

అయితే పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకను జక్కన్న ముంబైలో నిర్వహిస్తున్నాడట. ఇక ఈ వెడుకకు స‌ల్మాన్‌ఖాన్‌ ముఖ్య అతిధిగా పిలవడానికే ఆయన ఇంటికి వెళ్లారట. అయితే రామ్ చరణ్, సల్మాన్ ఖాన్‌కు మంచి బాండింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. నిజానికి చరణ్ పిలుదాం అని అనుకున్నాడట కానీ రాజమౌళి వెళ్లి ఆహ్వానిస్తేనే మర్యాదగా ఉంటుందని ఆయనమే స్వయంగా వెళ్ళారట. అందుకే ఈ మీటింగ్‌ జరిగిందని సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. కాగా ఆయన అభిమానులు మాత్రం జక్కన్న స‌ల్మాన్‌ఖాన్‌ తో సినిమా తీయ్యబోతున్నాడని..కధ చర్చిండానికే వెళ్లారని అంటున్నారు. ఏది ఏమైనా జక్కన్న స‌ల్మాన్‌ఖాన్‌ ను కలవడం వెనుక ఏదో సీక్రేట్ ఉన్నట్లు చెప్పుతున్నారు పలువురు నెటిజన్లు.

 

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news