Newsఉల్లి తో పుట్టుకొస్తున్న కొత్త వ్యాధి.. చాలా డేంజర్ అంటున్న నిపుణులు..!!

ఉల్లి తో పుట్టుకొస్తున్న కొత్త వ్యాధి.. చాలా డేంజర్ అంటున్న నిపుణులు..!!

ప్రపంచ దేశాలు అసలే ఈ రక రకాల కరోనాతో చస్తుంటే.. ఇప్పుడు కొత్తగా ప్రజలని చంపుకోడానికి తెర పైకి మరో వ్యాధి వచ్చిన్నట్లు తెలుస్తుంది. ఇంతకు ఆ వ్యాధి పేరు ఏంటో తెలుసా..? సాల్మోనెల్లా. యస్..ఇప్పుడు ఈ వ్యాధే అగ్ర రాజ్యం అమెరికాను ముప్పుతిప్పలు పెడుతున్న వ్యాధి . ఈ వ్యాధి ఉల్లిగ‌డ్డ‌ల ద్వారా వ్యాపిస్తుందట. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..ఇప్పటికే ఈ వ్యాధి 652 మందికి సోక‌గా 129 మంది హాస్పిటల్ ల్లో చికిత్స తీసుకుంటున్నట్లు సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ గురువారం వెల్ల‌డించింది.

ఈ ఉల్లిగడ్డలను మెక్సికో నుంచి దిగుమ‌తి చేసుకున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ ఉల్లిగడ్డలను ఆగ‌స్ట్ 27న చివ‌రిసారిగా దిగుమతి చేసుకున్నాయట అమెరికాలోని ప‌లు రెస్టారెంట్లు, దుకాణాల‌కు స‌ర‌ఫ‌రా చేశారు. ఎరుపు, తెలుపు, గోధుమ రంగులో ఉండే ఈ ఉల్లి అంటేనే అమెరిక‌న్లు ఇప్పుడు గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు. ఎరుపు, తెలుపు, గోధుమ రంగులో ఉండే ఈ ఉల్లి స్టోరేజ్ కూల‌ర్ల‌లో క‌నిపిస్తే వెంట‌నే పార‌వేయాల‌ని ఆ తరువాత శుభ్రం చేసి శానిటైజ్ చేయాల‌ని సీడీసీ ఆయా దుకాణాలు, రెస్టారెంట్ల‌ను కోరుతోంది.

అమెరికా, కెనడాల్లో చాలా మంది ఫుడ్ పాయిజన్ కలిగించే సాల్మోనెల్లా బ్యాక్టీరియా వ్యాధి బారినపడుతున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతుండ‌టం క‌ల‌వ‌రం క‌లిగిస్తోంది. ఈ వ్యాధి కారణంగా డయేరియా జ్వరం, కడుపునొప్పి వంటివి వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు ఉంటే వెంట‌నే డాక్టర్లను సంప్ర‌దించాల‌ని సీడీసీ సూచించింది. నీళ్లు ఎక్కువ‌గా తాగ‌డం ద్వారా ఈ వ్యాధిని నివారించ‌వ‌చ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news