Moviesస్టైలిష్ స్టార్ షాకింగ్ డెసిషన్..ఆ సినిమా నుండి అవుట్.. రీజన్ ఏంటో...

స్టైలిష్ స్టార్ షాకింగ్ డెసిషన్..ఆ సినిమా నుండి అవుట్.. రీజన్ ఏంటో తెలుసా..?

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. గ‌తేడాది సంక్రాంతికి అల వైకుంఠ‌పుర‌ములో లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో సుకుమార్ – బ‌న్నీ కాంబినేష‌న్లో వ‌చ్చిన ఆర్య‌, ఆర్య 2 సినిమాలు స‌క్సెస్ అవ్వ‌డంతో ఇప్పుడు పుష్ప‌పై సైతం అవే అంచ‌నాలు ఉన్నాయి. పుష్ప పార్ట్ 1ను ఈ యేడాది క్రిస్మ‌స్‌కు థియేట‌ర్ల‌లోకి తీసుకు వ‌చ్చేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇందులో బ‌న్నీ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌.

అయితే, సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేష‌న్‌లు అలా సెట్ అయిపోయి ఉంటాయి. ఆ కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుందంటే అభిమానులు కూడా ఎదురుచూస్తుంటారు. టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్ కూడా అలాంటిదే. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఆర్య సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. తొలి సినిమాతోనే సుకుమార్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఆర్య 2 వ‌చ్చింది. ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చెసుకుంది. బన్నీకి స్టైలిష్ స్టార్ అన్న పేరు రావ‌డానికి కార‌ణం ఆర్య సిరీస్ అనడంలో సందేహం లేదు.

 

కాగా ఎప్పటి నుండో ఆర్య3తో తీద్దాం అనుకున్న సుకుమార్‌ ఇప్పుడు ఈ సినిమా పై ఫోకస్ పెట్టిన్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..ఈ సినిమా లో హీరో రోల్ చేయబోయేది అల్లు అర్జున్ కాదట. ఆర్య3లో అల్లు అర్జున్ స్థానంలో మరో హీరోని ఎంపిక చేయనున్నారట సుకుమార్. ఈసారి ఆర్య పాత్రలో డైరెక్టర్ అర్జున్ రెడ్డిని చూపిస్తాడట. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే..అందుకు అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సో.. ఇప్పుడు మనం ఆర్య 3 సినిమాలో విజయ్ దేవరకొండాని చూడబోతున్నాం అనమాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news