Moviesబ్రేకింగ్‌: మా వార్‌లో విష్ణు లీడింగ్‌.. మెజార్టీ ఎంతంటే..!

బ్రేకింగ్‌: మా వార్‌లో విష్ణు లీడింగ్‌.. మెజార్టీ ఎంతంటే..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ మా ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు జ‌రుగుతోంది. కౌంటింగ్ కోసం మొత్తం ఆరు టేబుల్స్ ఏర్పాటు చేశారు. సినీ పెద్ద‌ల స‌మక్షంలో మా ఓట్ల లెక్కింపు జ‌రుగుతోంది. ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు చేప‌ట్టారు. అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డుతున్న ప్ర‌కాష్ రాజ్‌, విష్ణు ఇద్ద‌రూ కూడా డ‌యాస్ మీదే ఉండి ఓట్ల లెక్కింపును ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇక మోహ‌న్ బాబు, బాబు మోహ‌న్ సైతం అక్క‌డే ఉండి లెక్కింపు ఎలా ? జ‌రుగుతుందో చూస్తున్నారు.

ముందుగా ఈ సీ మెంబ‌ర్స్ ఓట్ల‌ను లెక్కిస్తున్నారు. చివ‌ర‌గా అధ్య‌క్ష ప‌ద‌వి ఓట్ల లెక్కింపు చేప‌డ‌తారు. ఇక పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు మంచు విష్ణు లీడ్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. విష్ణు వ‌ర్సెస్ ప్ర‌కాష్ రాజ్ మ‌ధ్య హోరాహోరీ పోరు కొన‌సాగింది. న‌రేష్ అయితే విష్ణు 80 నుంచి 100 ఓట్ల మ‌ధ్య‌లో మెజార్టీతో గెలుస్తారంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news