Moviesమా పోలింగ్ ముగిసింది... బెట్టింగ్ రాయుళ్ల మొగ్గు ఎవ‌రికి అంటే...

మా పోలింగ్ ముగిసింది… బెట్టింగ్ రాయుళ్ల మొగ్గు ఎవ‌రికి అంటే…

గ‌త రెండు నెల‌లుగా తీవ్ర ఉత్కంఠ‌కు గురి చేసిన తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ముగిశాయి. అయితే పోలింగ్ రికార్డు స్థాయిలో జ‌రిగింది. ఇప్ప‌టికే 700 కు పైగా ఓట్లు పోల‌య్యాయి అని చెపుతున్నారు. అయితే పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. మా ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు సాయంత్రం 4 గంట‌ల నుంచి ప్రారంభ మ‌వుతుంది. అయితే మా అధ్య‌క్షుడిగా ఎవ‌రు గెలుస్తారు ? అన్న‌దానిపై ఫిల్మ్‌న‌గ‌ర్లో ఇప్ప‌టికే బెట్టింగ్‌లు స్టార్ట్ అయ్యాయి.

ఈ ఎన్నికల్లో విష్ణు గెలుస్తారా ? ప్రకాష్‌ రాజ్ గెలుస్తారా ? అన్న దానిపై రెండు వ‌ర్గాలు ఎవ‌రి ధీమాలో వారు ఉన్నారు. విష్ణు గెలిస్తే 10కు 8 ఇస్తామ‌ని అంటున్నారు. అంటే రు. 10 ల‌క్ష‌ల‌కు రు. 8 ల‌క్ష‌లు ఇస్తారు. అదే ప్రకాష్‌ రాజ్ గెలిస్తే 10కి 12 అని బెట్టింగ్ రాయుళ్ళు రెచ్చిపోతున్నారట. దీనిని బ‌ట్టి బెట్టింగ్ రేటు విష్ణుపైనే ఎక్కువుగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఓవ‌రాల్‌గా పోలింగ్ ముగిసిన వెంట‌నే విష్ణు వ‌ర్గం కాస్త ఎక్కువ కాన్ఫిడెంట్‌తో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఫైన‌ల్ విన్న‌ర్ ఎవ‌రు ? అవుతారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news