Gossipsస్మాల్ ట్వీస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ ..ఈ వారం హౌస్ నుండి...

స్మాల్ ట్వీస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ ..ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్ ఇతనే..?

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో ప్రారంభమైన ఈ షో మొదటి హాట్ హాట్ గా సాగుతుంది. ఇప్పటికీ ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం నాలుగో కంటెస్టెంట్ హౌస్ నుండి వెళ్ళిపోయే టైం వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈసారి ఇంట్లోనుండి బయటకి వెళ్ళబోయే కంటెస్టెంట్ ఇతనే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

అతను ఎవరో కాదు..తన డ్యాన్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటరాజ్ మాస్టర్. యస్.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ మాత్రం నటరాజ్ మాస్టర్ అనే తెలుస్తుంది. ఇక ఈయన ఎలిమినేట్ అవ్వడానికి ముఖ్య కారణం..నటరాజ్ మాస్టర్ తీరుపై ప్రేక్షకులు అసహనం గా ఉండడమే. ఎందుకంటే ఈయనా ఒక్కో కంటెస్టెంట్‏ను జంతువులతో పోలుస్తూ అందరికీ ఇరిటేషన్ తెప్పిస్తున్నాడట.

జనరల్ గా మన జోలికి వస్తే అస్సలు వదిలిపెట్టకుండా.. ఓ ఆట ఆడుకుంటాం. ఇది అందరూ చేసే పనే.కానీ ఆ తరువాత అక్కడితో వదిలేస్తాం. అయితే నటరజ్ మాస్టర్ మాత్రం ఏదైన ఇష్యూ జరిగితే అది అక్కడితో ఆపేయకుండా ఇక అదే వివాదాన్ని కోనసాగిస్తున్నాడట. ఇక తనకు నచ్చని వారిని జంతువులతో పోలుస్తూ.. వారికి ఇష్టానుసారంగా పేర్లు పెడుతుండడంతో ఇంటి సభ్యులకే కాదు..బయట నుండి టీవీ చూస్తున్న వాళ్ళకు కూడా చిరాకు తెప్పిస్తున్నాడు.. అందుకే ఈ వారం మిగతా కంటెస్టెంట్లతో పోల్చుకుంటే ఆయనకు ఓట్లు తక్కువ పడ్డాయట. ఆ కారణంగా ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news