Newsఊహించని ట్వీస్ట్..బన్నీ కి సైలెంట్ షాక్ ఇచ్చిన రౌడీ సీఎం..?

ఊహించని ట్వీస్ట్..బన్నీ కి సైలెంట్ షాక్ ఇచ్చిన రౌడీ సీఎం..?

టాలీవుడ్ లో ఇప్పుడు యూత్ హీరోగా విజయ్ దేవరకొండ ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నటించిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమాలతో యూత్ హీరోగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ‘లైగర్’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

అయితే ఈ సినిమా తరువాత విజయ్ దేవ‌ర‌కొండ డైరెక్ట‌ర్ సుకుమార్ తో ఓ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చడు. సుకుమార్ ని లైన్ లో పెట్టే.. మ‌రోవైపు మజిలీ ఫేం శివ నిర్వాణ తో సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాక్. ఇలా వరుసగా సినిమాలతో బిజీగా ఉంటూనే..సోషల్ మీడియాలో దుమ్ముదులిపేస్తున్నాడు ఈ యంగ్ క్రేజీ హీరో. చేసింది తక్కువ సినిమాలే అయినా..చేసిన ప్రతి సినిమాలో తన నటనతో అందరి మనసులను గెలుచుకున్నాడు ఈ రౌడీ సీ ఎం.

అయితే, ఇన్ స్టాగ్రామ్ లో విజయ దేవరకొండా13 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ కు చేరుకున్నాడు. సౌత్ హీరోలలో అత్యధికంగా ఫాలోవర్స్ ను పొందిన స్టార్ గా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే… తాజాగా ఆ రికార్డ్ ను విజయ్ బీట్ చేసాడు. ఇక్కడ మరో విశేషం ఏమంటే… ఈ ఫీట్ ను అత్యంత తక్కువ సమయంలో సాధించిన హీరోగా సరికొత్త రికార్డ్ సృష్టించాడని తాజాగా విడుదలైన పోస్టర్ ద్వారా తెలిస్తోంది. ఏదేమైనా… అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో రికార్డ్ను ఇంత తక్కువ టైంలో టచ్ చేయడం గ్రేట్ అనే అంటున్నారు సినీ పెద్దలు. ఇది అంతా విజయ్ అభిమానులు కారణంగానే సాధ్యమైందత.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news