Moviesఆ డైరెక్టర్ నన్ను అసహ్యంగా ఉన్నావు అన్నారు..అందరిని ఆకర్షిస్తున్న ఎన్టీఆర్ మాటలు..!!

ఆ డైరెక్టర్ నన్ను అసహ్యంగా ఉన్నావు అన్నారు..అందరిని ఆకర్షిస్తున్న ఎన్టీఆర్ మాటలు..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తారక్ ఈ షోను హోస్ట్ చేస్తుండడంతొ కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ మాటల తూటాలు బుల్లితెర ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇందులో తారక్ లుక్,మాటలు..తారక్ కలుపుగోలుతనం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.

ఇక ఈ షోలో మొదటి గెస్ట్ గా “RRR” కో స్టార్ రామ్ చరణ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచరం ప్రకారం మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి దర్శక దిగ్గజ ధీరుడు రాజమౌళి గెస్ట్ గా రానున్నాడట. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ కూడా షూట్ చేసిన్నట్లు తెలుస్తుంది. దీంతో రాజమౌళి-తారక్ మధ్య సంభాషణలు ఎలా ఉంటాయని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇది ఇలా ఉండగా..తాజాగా తారక్ జక్కన్న గురించి షాకింగ్ కామెంత్స్ చేసారు. రీసెంట్ గా మీలో ఎవరు కోటీశ్వరుడు కంటెస్టెంట్ తో ముచ్చటంచిన తరక్..ఒక కంటెస్టెంట్ తన బట్టతల కారణంగా చాలా ఆత్మనూన్యత భావంతో ఉన్నాను అంటూ తెలియజేశాడు. అప్పుడు తారక్ మాట అందుకుని .. అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు దాటింది. ఫస్ట్ లో నేను చాలా లావుగా ఉండేవాన్ని. రాజమౌళి తనను అసహ్యంగా ఉన్నారు అన్నాడు.. అంటూ చేసిన వ్యాఖ్యల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపర్చాడు. అలా ఉన్నపూడే మన చుట్టు ఉన్న స్నేహితులు మనకు చక్కని మార్గ నిర్దేశం చేస్తారు. వారే మనకు నిజమైన స్నేహితులు అంటూ అందరి దృష్టిని ఆకర్షించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news