Moviesప్రియ‌మ‌ణి బికినీ అందుకే వేసుకుంది.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!!

ప్రియ‌మ‌ణి బికినీ అందుకే వేసుకుంది.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!!

ప్రియ‌మ‌ణి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగులో ఆమె బాల‌య్య‌, ఎన్టీఆర్‌, గోపీచంద్‌, జ‌గ‌ప‌తిబాబు, నితిన్ లాంటి హీరోల సినిమాల్ల న‌టించింది. అప్పుడెప్పుడో ప‌దిహేడేళ్ల క్రితం వ‌చ్చిన ఎవ‌రే అత‌గాడు సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన ప్రియ‌మ‌ణి కుర్ర హీరోల నుంచి సీనియ‌ర్ హీరోల వ‌ర‌కు అంద‌రితోనూ న‌టించింది. కెరీర్ మొద‌ట్లో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసింది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన య‌మ‌దొంగ లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాలో న‌టించి ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది.

ఆ తరువాత సరైన హిట్ పడలేదు. దీంతో ఎంచ‌క్కా పెళ్లి చేసుకుని బెంగ‌ళూరులో సెటిల్ అయ్యి కొద్ది రోజుల పాటు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసిన ఈ అమ్మ‌డు ఇప్పుడు సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసింది.
సెకండ్ ఇన్సింగ్స్‌లో తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సీరీస్ ల‌లో న‌టిస్తూ ప్రియ‌మ‌ణి త‌న టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది. చిన్న పిల్ల‌ల‌కే కాకుండా ఎదిగిన బిడ్డ‌లున్న త‌ల్లి పాత్ర‌లో న‌టించి వావ్ అనిపిస్తోంది.

ఒకప్పుడు గ్లామరస్‌ రోల్స్ కూడా చేసిన ఈ అమ్మడు ఓ సినిమాలో బికినీలో కనువిందు చేసింది. ప్రియమణి.. నితిన్‌ హీరోగా రూపొందిన ద్రోణ సినిమాలో ప్రియ‌మ‌ణి బిక‌నీ షోతో మైండ్ బ్లాక్ చేసింది. జె.కరుణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డీ.ఎస్‌.రావు నిర్మాత.అయితే అప్ప‌ట్లో నిర్మాత బ‌ల‌వంతంతోనే ప్రియమ‌ణి బికినీ వేసుకునేందుకు ఒప్పుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ద్రోణ సినిమా నిర్మాత డీఎస్ రావు ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. ప్రియ‌మ‌ణిని ద‌ర్శ‌కుడు సినిమాలో మీరు బికినీ వేసుకోవాలి మీకు ఓకే నా అని అడిగినప్పుడు..ఆమె త‌న త‌ల్లితో మాట్లాడి చెబుతా అని.. ఐదు నిమిషాల్లోనే ఓకే చెప్పింద‌న్నారు. అంతే కాకుండా ప్రియ‌మ‌ణి బికినీ వేసుకునేందుకు ఎక్కువ రెమ్యున‌రేష‌న్ ఏం డిమాండ్ చేయ‌లేద‌న్నారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news