Moviesసినిమా హిట్ అయితేనే మెగాస్టార్ ఛాన్స్ ఇస్తారా..చిరంజీవిని కడిగిపారేస్తున్న నెటిజన్స్..??

సినిమా హిట్ అయితేనే మెగాస్టార్ ఛాన్స్ ఇస్తారా..చిరంజీవిని కడిగిపారేస్తున్న నెటిజన్స్..??

తెలుగు యంగ్ డైరెక్టర్ సంపత్ నంది వరుణ్ తేజ్ హీరోగా నిషా అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన ‘ఏమైంది ఈ వేళ’ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం గా నిలిచింది. ఆ సినిమా తరువాత రాం చరణ్ తో ‘రచ్చ’ , రవితేజ హీరోగా ‘బెంగాల్ టైగర్’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో సంపత్ నంది తెలుగులో ఒక మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే ఈమద్య కొంత కాలంగా ఆయనకి సరైన హిట్ రాలేదు. దీంతో ఆయన ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. అయితే ఒక్క హిట్ తో ఇండస్ట్రీలో లెక్కలు అన్ని మార్చేసాడు సంపత్. గోపిచంద్ హీరోగా ‘సీటిమార్’ సినిమా ఇటీవల రీలిజ్ అయినా విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఏం అంచనాలు లేకుండా విడుదలై ..బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాని అందుకుంది. మంచి టాక్ తో సూపర్ హిట్ వైపు దూసుకెళ్తోంది. ఇందులో గోపిచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా చేసింది.

ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో ముందుకు దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితులలో ఈ యంగ్ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా తీయబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ‘సీటీమార్’ సినిమా ట్రైలర్ ను చిరంజీవి కి చూపించి మంచి ప్రశంసలు కొట్టేసిన ఈ యంగ్ డైరెక్టర్ అదే జోష్ లో చిరంజీవి ఒక అదిరిపోయే కథను వినిపించి ఓకే చేయించుకోవాలి అని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆయన నిజంగా చిరంజీవితో సినిమా చేస్తున్నాడో లేదో తెలియదు కానీ..నెట్టింటా మాత్రం చిరంజీవిని ఏకి పారేస్తున్నారు నెటిజన్స్. సినిమా హిట్ పడితే కానీ మెగాస్టార్ చిరంజీవికి యంగ్ డైరెక్టర్స్ కనపడరా..?? ఇదే సంపత్ నంది వరుస ఫ్లాప్ లతో ఉన్నప్పుడు ..చిరంజీవి అవకాశం ఇవ్వచు కదా..?? సీటిమార్ సినిమా హిట్ కావడంతో ఈయన సినిమా చేయడానికి సిద్దమౌతున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news