Moviesతెలుగు సినిమాలకు హన్సిక ఎందుకు సైన్ చేయడం లేదో తెలుసా..??

తెలుగు సినిమాలకు హన్సిక ఎందుకు సైన్ చేయడం లేదో తెలుసా..??

హ‌న్సిక‌.. ఈ పేరు త‌లుచుకోగానే బొద్దు అందాల‌తో క‌ళ్ల‌ముందుకు ఆమె అలా వ‌చ్చేస్తుంది. ఈ బొద్దందాల‌తోనే ఇండ‌స్ట్రీని షేక్ చేస్తుంది హ‌న్సిక‌. త‌మిళ‌నాట అయితే ఈమెకు ఏకంగా గ‌డి కూడా క‌ట్టేసారు అభిమానులు. చిన్న వయసులోనే సినిమాల్లో నటించే అవకాశం కొట్టేసిన హన్సిక తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అందం, అభినయం, అమాయకత్వం అన్ని కలగలిపితే హన్సిక అనడంలో సందేహమే లేదు. దేశముదురు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన బొద్దు గుమ్మ హన్సిక, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వచ్చింది.

ఈమె చిన్నప్పుడు బాలీవుడ్లో బాల నటిగా నటించి అక్కడ కూడా మంచి ప్రశంసలు అందుకుంది. నాటి నుంచి నేటి వరకు సినీ ఇండస్ట్రీలో చాలా చురుకుగా కనిపించే హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం హన్సిక అని మాత్రమే చెప్పవచ్చు. ముఖ్యంగా తమిళ్ ,తెలుగు భాషలలో ఏకంగా 50 చిత్రాలకు పైగా నటించి తనకంటూ ఒక బెంచ్ మార్కును క్రియేట్ చేసుకుంది.బబ్లీ బ్యూటీ హన్సిక ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం హన్సిక ‘105 మినిట్స్’ అనే సినిమాలో నటిస్తోంది. రాజు దుస్సా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మొత్తం ఒకే ఒక్క క్యారెక్టర్ తో నడుస్తుంది.

ఇకపోతే వరుస సినిమాలతో బిజీ అయి దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేక కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి మకాం మార్చింది. అక్కడ వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంది హన్సిక. కాగా ఆ మధ్య ఫేడవుట్ హీరోయిన్‌గా కనబడకుండా పోయిన హన్సిక ఇప్పుడు మళ్లీ కొన్ని సినిమాలు చేస్తోంది. తమిళంలో ఈ పాపకు అదిరిపోయే ఆఫర్లతో రచ్చ చేస్తోంది. అయితే తెలుగులో మాత్రం ఈ అమ్మడుకి ఆశించినంత ఆఫర్స్ రావడం లెదౌ. రీజన్ తెలియదు కానీ వచ్చిన ఒక్కటి , రెండూ ఆఫర్స్ కూడా అమ్మడు రిజెక్ట్ చేస్తుంది. అసలు హన్సిక కి తెలుగు సినిమాలో చేయడం ఇష్టం లేదో..లేక సరైన ఆఫర్ కోసం ఎదురుచూస్తుందో అర్ధం కావడంలేదు. కానీ ఈ అమ్మడు తెలుగు తెర పై కనిపిస్తే చాలా మంది అభిమానులు ఆశపడుతున్నారు. మరి చూడాలి హన్సిక ఏం చేస్తుందో..??

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news