Moviesఅమ్మో..తాత ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ .. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

అమ్మో..తాత ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ .. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఈ భూమి మీద ఎంతో మంది పుడుతుంటారు, పోతుంటారు. కానీ, కొంత మంది మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి మహానుభావుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒకరు. వెండితెరపై అందాల రాముడైనా … కొంటె కృష్ణుడైనా ..ఏడుకొండల వాడైనా..ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు.. ఈ పేరులోనే ఏదో తెలియని పవర్ ఉంది. ఆంధ్రులు అన్న అని ముద్దుగా పిలుచుకునే వ్యక్తి నందమూరి తారక రామారావు.

తాతకు తగ్గ మనవడిగా, తాతకు ఏమాత్రం తీసిపోకుండా నటనలో, తెలివిలో తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. హరికృష్ణ తన రెండవ భార్య షాలిని ముద్దుల కొడుకట ఎన్టీఆర్. అప్పటివరకు ఎన్టీఆర్ తల్లిని తమ కుటుంబంలో ఒక భాగంగా చేసుకోలేదట నందమూరి తారక రామారావు కుటుంబం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టడంతో నందమూరి తారక రామారావు గారు హరికృష్ణ రెండవ భార్య అయిన షాలినిని తమ కుటుంబంలోకి స్వీకరించడం జరిగింది. నందమూరి అభిమానులంతా జూనియర్ ఎన్టీఆర్ లో సీనియర్ ఎన్టీఆర్ ను చూసుకుంటున్నారు. నటనలోనూ, వాక్చాతుర్యంలోనూ జూనియర్ ను చూస్తోంటే పెద్దాయనే గుర్తుకు వస్తారని అభిమానులు చెబుతుంటుంటారు. ఇక పౌరాణిక పాత్రల్లో కూడా ఎన్టీఆర్ లా రాణిస్తారని, యమదొంగతో నిరూపించారు. విలన్ పాత్రలను కూడా పోషించిన చరిత్ర సీనియర్ ఎన్టీఆర్ ది. అందుకే జై లవకుశ సినిమాలో, జూనియర్ తనలోని విలనిజాన్ని కూడా చూపించి తాతకు తగ్గ మనవడిని అనిపించుకున్నారు.

ఇకపోతే ఎన్టీఆర్ ఇటీవల తన తాతకు సంబంధించిన ఒక విషయం బయట పెట్టడం జరిగింది. నటన పట్ల తన తాత సీనియర్ ఎన్టీఆర్ కు ఎంత డెడికేషన్ ఉండేదో అనే విషయాన్ని చెప్పుకొచ్చారు మనవడు జూనియర్ ఎన్టీఆర్. ఒకసారి ఒక సినిమా షూటింగ్ టైంలో ఒక బెత్తంతో ఆయన తొడపై ఆయనే గట్టిగా కొట్టుకోవలసి వచ్చిందని..అయితే అప్పటికే ఒక షాట్ రెండు మూడు సార్లు టేక్ అప్ చేయడం జరిగిందని.. డైరెక్టర్ కూడా ఓకే చెప్పారని తెలుస్తుంది.కానీ ఆ సీన్ చూసిన తర్వాత తాత ఎన్టీఆర్ కు మాత్రం సంతృప్తి కలగలేదట..దీంతో మళ్లి తర్వాత రోజు అదే సీన్ షూట్ చేయించారట సీనియర్ ఎంటీఆర్ ఆ డైరెక్టర్ తో ..ఇలా తాత ఆ సీన్ మళ్లీ ఎందుకు చేయించారు అంటే, ఆ సీన్ లో ముఖంలో కాస్త ఎక్స్ప్రెషన్ మిస్సయింది అని అనిపించడం వల్లే , అలా చేయించారని చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news