Moviesఫర్ ది ఫస్ట్ టైం..కెమెరా ముందు కన్నీళ్లు పెట్టుకున్న హైపర్ ఆది..ఎందుకో...

ఫర్ ది ఫస్ట్ టైం..కెమెరా ముందు కన్నీళ్లు పెట్టుకున్న హైపర్ ఆది..ఎందుకో తెలుసా..?

హైపర్‌ ఆది..ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. జబర్ధస్త్ అనే షో ద్వారా ప్రపంచానికి పరిచయమైన ఆది తనదైన శైలిలో కామెడీ పండిస్తూ హైపర్‌ ఆదిగా గుర్తింపు తెచ్చుకున్నాడు… చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులర్ అయిపోయాడు. తనదైన కామెడీ టైమింగ్‌, పంచు డైలాగులతో షోని రక్తి కట్టిస్తాడు. ఇక ఏ షో చేసిన అందులో ఆడవాళ్లు, మహిళ యాంకర్స్‌పై అతడు వేసే డబల్‌ మీనింగ్‌ పంచ్‌లు మాములుగా ఉండవు. ఎంతటి వారినైనా అవి ఆకట్టుకుంటాయి. అదే సమయంలో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఎదుటి వారిపై పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు ఎనలేని కామెడీని అందిస్తుంటాడు.

ప్రస్తుతం ఓ వైపు జబర్దస్త్ మరోవైపు “ఢీ” షోలతో బిజీ బిజీగా ఉన్న ఇటు సినిమాలోను ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే ఇప్పుడు అందరిని నవ్వించే ఆది..ఈసారి కొంచె ఎమోషనల్ అయ్యాడు. వినాయక చవితి సంధర్భంగా ఊరిలో వినాయకుడు అనే ప్రోగ్రాం చేస్తున్న ఆది. ఊరిలో వినాయకుడు’ అంటూ ఈ వినాయక చవితి రోజు స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేసి తాజాగా ఆ షో ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో ఆధరంగా సుధీర్, రష్మీ, పూర్ణ కలిసి శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమా స్పూఫ్ చేస్తున్నారు.

అంతే కాకుండా ఈ ప్రోగ్రాంలో కొంత మంది జబర్దస్త్ సెలబ్రిటీలు వెళ్లి వినాయక చవితి చందా వసూలు చేశారు. ఈ ప్రోగ్రాం లో హైపర్ ఆది ఎమోషనల్ అయ్యారు. ఇక ఆది ఎమోషన్ల్ అవుతున్నప్పుడు 9 సంవత్సరాలలో మొదటి సారిగా హైపర్ ఆది ఎమోషనల్ అయ్యారు అంటూ సుడిగాలి సుధీర్ అంటారు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. సో.. చూడాలి మరి ఈ వినాయక చవితి నాడు ఆది ఎందుకు అంత ఎమోషనల్ అయ్యాడు అనేది..!!

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news