Moviesవామ్మో..సోషల్ మీడియాలో చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. రీజన్ ఇదే..!!

వామ్మో..సోషల్ మీడియాలో చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. రీజన్ ఇదే..!!

రాం చరణ్..ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేస్తూనే అటు కొరటాల శివ- చిరంజీవి కాంబోలో రాబోతున్న ‘ఆచార్య’ షూటింగ్ వర్క్స్ ఫినిష్ చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తైన వెంటనే.. చరణ మరో బడా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను లైన్‌లో రెడీగా పెట్టేశారు. దీంతో ఈ రెండు సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో “ఆర్‌సి 15” అనే పాన్ ఇండియా మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీని దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ కంప్లీట్ చేసిన శంకర్.. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లాలని అంతా సిద్ధం చేస్తున్నారట.ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ నెలలోనే రామ్ చరణ్ – శంకర్ RC15 మొదలు కాబోతుంది. దాని కోసం రామ్ చరణ్ అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజులు భారీ ప్లాన్స్ చేసినట్టుగా తెలుస్తుంది.

సెప్టెంబర్ 8వ తేదీన రామ్ చరణ్ – శంకర్ మూవీ ని అఫీషియల్ గా మొదలు పెట్టి అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తుంది. అయితే సెప్టెంబర్ 8న ఈ మూవీ పూజ కార్యక్రమాలను నిర్మాత దిల్ రాజు ఆఫీస్ లో గ్రాండ్‌ గా ప్లాన్ చేశారట. ఇందుకోసం కోలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారని సమాచారం. సెప్టెంబర్ 8 నే RC15 పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతుంది అంటూ రామ్ చరణ్ ఫాన్స్ రచ్చ షురూ చేసారు. ఫ్యాన్ మెడ్ పోస్టర్స్ తో RC15 ఓపెనింగ్ డేట్ ని ప్రింట్ చేసి షేర్ చేస్తున్నారు. RC15 ఓపెనింగ్ డేట్ తో రామ్ చరణ్ ఫాన్స్ చేసే హడావిడికి సోషల్ మీడియా షేక్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news