Movies‘పుష్ప’లో మరో క్యూట్ హీరోయిన్.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన సుక్కు..?

‘పుష్ప’లో మరో క్యూట్ హీరోయిన్.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన సుక్కు..?

ప్ర‌స్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లెక్కల డైరెక్టర్ సుకుమార్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య‌, ఆర్య 2 సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయో మనకు తెలిసిందే. ఇక ఆ సినిమా ల త‌ర్వాత అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేష‌న్‌లో వస్తున్న ఈ సినిమా ..పాన్ ఇండియా మూవీ పుష్ప తెరకెక్కుతుంది. ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలే ఉన్నాయి.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘పుష్ప’ మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన 90 శాతం షూటింగ్ పూర్తైంది.ఇక ఈ సినిమాలో మొదటి సారి అల్లు అర్జున్ కు జంటగా..రష్మిక మందన నటిస్తుంది. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..ఈ సినిమాలో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ర‌ష్మీక గిరిజ‌న అమ్మాయిగా కనిపించబోతుంది. తాజాగా ‘పుష్ప’ మూవీ నుంచి ఓ ఆసక్తికరమై వార్త బయటకు వచ్చింది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందట. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా నటిస్తుందట. ఈమె అల్లు అర్జున్ సోదరి గా పుష్ప సినిమాలో మనకు కనిపిస్తుందనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక పోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలిను విలన్స్ దారుణంగా రేప్ చేసి చంపేస్తారట. ఇక ఆ తరువాత మంచిగా సైలెంట్ గా తన పని తాను చేసుకునే హీరో క్రూరంగా మారిపోయి వాళ్లపై పగ తీర్చుకుంటాడని తెలుస్తోంది. ఈ పాత్ర చనిపోయే సన్నివేశాలు ఎంతో భావోద్వేగంగా సాగుతాయని .. టోటల్ సినిమాని మలుపు తిప్పే సీన్స్ చాలా ఉన్నాయని సమాచారం. అందుకే ఈ పాత్రకు ఇనోసెంట్‌గా కనిపించే వర్షను ఎంపిక చేసుకున్నారని టాక్ వినిపిస్తుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news