Moviesఇంకా వెంటిలేటర్‌పైనే సాయి ధరమ్ తేజ్..అభిమానులకు అర్ధం కాని విషయం ఏమిటంటే..??

ఇంకా వెంటిలేటర్‌పైనే సాయి ధరమ్ తేజ్..అభిమానులకు అర్ధం కాని విషయం ఏమిటంటే..??

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆయనకు చాలా తీవ్ర గాయలయ్యాయి. కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్‌లో తన స్పోర్ట్స్ బైక్ మీదనుంచి అదుపుతప్పి క్రిందపడ్డారు సాయి తేజ్. ఈ యాక్సిడెంట్‌లో ఆయన కుడి కన్ను, ఛాతిపై బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో వెంటనే ఆయన్ను దగ్గర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స్ కోసం అక్కడి నుంచి అపోలో షిఫ్ట్ చేసి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.

ప్రస్తుతం ఐసీయూలో ఆయన చికిత్స కొనసాగుతోంది. సరైన సమయంలో చికిత్స అందడం వల్లే సాయి ధరమ్‌ తేజ్‌కు ప్రాణాపాయం తప్పిందని తేజ్‌కు మొదట ట్రీట్‌మెంట్‌ చేసిన మెడికవర్‌ వైద్యులు తెలిపిన విషయం విధితమే. గోల్డెన్ అవర్‌లో అతన్ని ఆస్పత్రికి తీసుకురావడం, ఆ టైమ్‌లో ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ వల్లే సాయి తేజ్‌ ప్రాణాలతో బయటపడ్డారన్నారు. ఇది ఇలా ఉంటే ప్ర‌మాదం జ‌రిగినప్పుడు స్కానింగ్‌, ఎమ్మారై స్కాన్ వంటి ప‌రీక్ష‌లు నిర్వహించిన డాక్ట‌ర్స్ తేజ్ త‌ల‌, వెన్నెముక‌కు గాయాలు కాలేద‌ని కాల‌ర్ బోన్ విరిగింద‌ని తెలియ‌జేశారు. అప్పటి నుండి అబ్జ‌ర్వేష‌న్‌లో వెంటిలేట‌ర్‌పై ఉన్నాడు.

సాయి ధ‌ర‌మ్‌తేజ్ కు ఆదివారం కాల‌ర్‌బోన్‌కు డాక్ట‌ర్స్ శ‌స్త్ర చికిత్సను ప్రారంభించారు. కాలర్ బోన్ సర్జరీ కూడా సక్సెస్ అయింది. అయితే ఇంకొన్ని రోజులు సాయి ధరమ్ తేజ్ వెంటిలేటర్ మీదే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఇక్కడ అభిమానులకు అర్ధం కానీ విషయం ఎమిటంటే..సాయి ఆరోగ్యం అంత బాగానే ఉంది అంటున్నారు..కానీ వెంటిలేటర్ పైనే ట్రీట్ మెంట్ కొనసాగిస్తాం అంటున్నారు..దీంతో ఆయన అభిమానులకి ఈ విషయమై గందర్గోళ పరిస్దిథి నెలకొంది.

అయితే న‌టుడు సాయిధ‌రమ్ తేజ్ ఆరోగ్య ప‌రిస్థితిపై అపోలో ఆస్ప‌త్రి వైద్యులు హెల్త్ బులెటిన్‌ను సోమ‌వారం మ‌ధ్యాహ్నం విడుద‌ల చేశారుసాయితేజ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌న్నారు. ఐసీయూలోనే ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నాం. వెంటిలేట‌ర్ అవ‌స‌రం క్ర‌మంగా తగ్గుతోంద‌ని వైద్యులు వెల్ల‌డించారు. ఇక సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య విషయంలో మెగా ఫ్యామిలీ తీసుకుంటున్న జాగ్రత్తలు అందరికీ తెలిసిందే.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news