Newsఅగ్ర రాజ్యం అమెరికాను గడగడలాడిస్తున్న “ఐదా”

అగ్ర రాజ్యం అమెరికాను గడగడలాడిస్తున్న “ఐదా”

కరోనా మహమ్మారి దెబ్బకే అల్లాడి పోతున్న అగ్ర రాజ్యం అమెరికా నేడు ప్రకృతి చేస్తున్న ప్రళయానికి గజగజా వణికి పోతోంది. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం అమెరికాను అతలాకుతలం చేసిన కత్రినా హరికేన్ కంటే కూడా తాజాగా అమెరికా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఐదా తుఫాను ఎన్నో రెట్లు అధికమని అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం అమెరికాలో పలు రాష్ట్రాలలో ఐదా తుఫాను సృష్టిస్తున్న అలజడి తీవ్రస్థాయిలో ఉంది. విరుచుకుపడుతున్న భీకరమైన గాలులు, తుఫాను, వర్షాలతో అమెరికాలోని లూసియానా రాష్ట్రం అదిరిపడుతోంది.

అమెరికాలో ఐదా తుఫాను అంచనా వేసిన అధికారులు ఇది 4 వ కేటగిరికి చెందిన తుఫాను గా డిసైడ్ చేశారు. గంటకు దాదాపు 241 కిలోమీటర్ల వేగంతో అత్యంత బలంగా గాలులు వీస్తున్నాయని దాంతో లూసియానా రాష్ట్రంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, రోడ్లపై నీరు నదిలో ప్రవహించే స్థాయిలో చేరుకుందని, ఎన్నో ఇళ్ళు, పలు వాహనాలు ఈ వరదల్లో కొట్టుకుపోయాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే

మిసిసిపీ లో సైతం ఈ తుఫాను తీవ్ర ప్రభావం చూపించిదని తెలిపారు అధికారులు. తీరం దాటే సమయంలో ఐదా సృష్టించిన భీభత్సం ఎలా ఉందంటే, ఆ సమయంలో వీచిన పెను గాలులకు మిసిసిపీ నది వెనక్కు ప్రవహించిందని, దాంతో నదికి మధ్య మధ్యలో ఉండే ఆనకట్టలు కొట్టుకుపోయాయని అధికారులు వెల్లడించారు. ఇక న్యూ ఒర్లిన్ ప్రాంతంలో చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలమట్టం అయ్యాయి. విధ్యుత్ నిలిచిపోవడంతో గంటల వరకూ ఆ ప్రాంతం మొత్తం చీకటిలోనే ఉండిపోయింది. టెలికం వ్యవస్థ, పనిచేయక పోవడంతో అత్యవసర విభాగాలు అన్ని నిలిచిపోయాయి. అసలే కరోనాతో అల్లాడిపోతున్న తమకు ఈ తుఫాను తీరని నష్టం మిగిల్చిందని అమెరికన్స్ ఆవేదన చెందుతున్నారు. పలు ప్రాంతాలలో ఈ తుఫాను చేసిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు అధికారులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news