Moviesప్రభాస్ లోని ఆ బాడీ పార్ట్ చూసే ఈ రోల్ కి...

ప్రభాస్ లోని ఆ బాడీ పార్ట్ చూసే ఈ రోల్ కి సెలెక్ట్ చేసా..డైరెక్టర్ స్టన్నింగ్ ఆన్సర్..!!

స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆది పురుష్’ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ రామాయణం నేపథ్యంలో ఏకకాలంలో హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న సినిమా. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు క్రేజీ స్టార్ల‌తో ఈ సినిమాకు నేష‌న‌ల్ క్రేజ్ వ‌చ్చేసింది.

అయితే ఈ సినిమా మొదలైన దగ్గరనుంచి ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. తాజాగా రాజీవ్ పసంద్ తో ఇంటర్వ్యూ లో పాల్గొన్న చిత్ర దర్శకుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేశారు.

ఈ సినిమాలో శ్రీరాముడిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నే ఎందుకు తీసుకున్నారు అని అడిగితేఅ..ఆయనకు ఓం రౌత్ రాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. “నేను కేవలం ప్రభాస్ కళ్ళు ను చూసే ఈ సినిమా కి ఆయన పర్ఫేక్ట్ అని అనుకున్నాను. ప్రభాస్ కళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే ప్రభాస్ మాత్రమే ఆ పాత్రను చేయగలరని భావించి..ఆయనను ఈ రోల్ కి సెలెక్ట్ చేశాను..” అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు ఓం రౌత్. టి సిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news