Moviesవావ్ ఏం కాంబో... అనుష్క‌తో రౌడీ హీరో.. !

వావ్ ఏం కాంబో… అనుష్క‌తో రౌడీ హీరో.. !

పాతికేళ్ల వ‌య‌స్సు ఉన్న ఓ అవివాహిత అయిన ఆంటీ 25 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న యువ‌కుడితో ప్రేమ‌లో ప‌డితే ఎలా ? ఉంటుంద‌న్న క‌థాంశంతో ఓ సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో 40 ఏళ్ల ఆంటీగా అనుష్కా శెట్టి, ఆ 25 ఏళ్ల యువకుడిగా న‌వీన్ పోలిశెట్టి న‌టిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేష‌న్ పై అనౌన్స్ మెంట్ వ‌చ్చిన వెంట‌నే ఎక్క‌డా లేని ఆస‌క్తి నెల‌కొంది. గ‌తంలో అనుష్క‌తో మిర్చి – భాగ‌మ‌తి వంటి హిట్ సినిమాలు నిర్మించిన యూవీ క్రియేష‌న్స్ వాళ్లే ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

రారా కృష్ణ‌య్య ఫేమ్ మ‌హేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు మిస్ శెట్టి & మిస్ట‌ర్ పోలిశెట్టి అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని కూడా ఓ ప్ర‌చారం అయితే ఉంది. అయితే దీనిపై ఎవ్వ‌రూ క్లారిటీ ఇవ్వ‌లేదు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో రౌడీ హీరోది గెస్ట్ రోల్ అని తెలుస్తోంది. ఇంట‌ర్వెల్‌కు ముందు ఈ క్యారెక్ట‌ర్ ఎంట్రీ ఉంటుందని.. ఇంట‌ర్వెల్ త‌ర్వాత కొద్ది సేపు మాత్ర‌మే ఈ రోల్ ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబోపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news