Moviesచైతు - స‌మంత ఫ్యామిలీ లైఫ్‌.. ఆ రెండు విష‌యాల్లోనే సామ్‌కు...

చైతు – స‌మంత ఫ్యామిలీ లైఫ్‌.. ఆ రెండు విష‌యాల్లోనే సామ్‌కు సంతృప్తి లేదా…!

స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని వార‌సుడు నాగ‌చైత‌న్య‌ను పెళ్లి చేసుకుని తెలుగు కోడ‌లిగా సెటిల్ అయిపోయింది. తాజా ఇంట‌ర్వ్యూలో సమంత తాను చైతును పెళ్లి చేసుకుని అన్ని విష‌యాల్లో హ్యాపీగా ఉన్నా రెండు విష‌యాల్లో మాత్రం తాను చైతు విష‌యంలో ఎప్ప‌ట‌కీ అన్ హ్యాపీయే అని చెప్పింది. స‌మంత చెప్పిన మ్యాట‌ర్ ప్ర‌కారం త‌మిళ‌నాడులో పుట్టి పెరిగిన వారికి .. ఇంకా చెప్పాలంటే చెన్నై వాసుల‌కు బీచ్‌తో ఎంతో సంబంధం ఉంటుంది. ఎవ‌రికి వారు ర‌క‌ర‌కాల పార్టీల‌ను ఆ బీచ్‌లోనే సెల‌బ్రేట్ చేసుకుంటూ ఉంటారు.

అయితే హైద‌రాబాద్‌లో బీచ్ లేక‌పోవ‌డం వ‌ల్ల ఆ ఎంజాయ్ మిస్ అవుతున్నామ‌ని సమంత చెప్పింది. చైతు అలాంటి ఎంజాయ్‌కు దూరంగా ఉండ‌డంతో స‌మంత ఆ ఎంజాయ్‌ను మిస్ అవుతున్న‌ట్టు చెప్పింది. ఇక త‌మిళ‌నాడులో ఉన్న స‌మ‌యంలో స‌మంత అద్భుత‌మైన బ్రేక్ పాస్ట్ తింటూ ఎంజాయ్ చేస్తుంద‌ట‌. అక్క‌డ ర‌క‌ర‌కాల టిఫిన్లు ఉంటాయ‌ని.. హైదరాబాద్ లో అలాంటి బ్రేక్ ఫాస్ట్ లభించద‌ని…. చెన్నై స్పెష‌ల్ బ్రేక్ ఫాస్ట్‌ను తాను ఎంజాయ్ చేయ‌లేక‌పోతున్నాన‌ని చెప్పింది.

ఈ రెండు విష‌యాల్లోనే త‌న‌కు అసంతృప్తి ఉంద‌ని… ఇక పెళ్లి త‌ర్వాత కూడా తాను చైతుతో ఫ్యామిలీ లైఫ్‌ను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాన‌ని… తన‌కు పెళ్ల‌య్యాక కూడా సినిమాలు చేసుకునే స్వేచ్ఛ ఉండ‌డం ఆనందంగా ఉంద‌ని సామ్ చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news