Moviesఇదేం చంఢాలం..అందరి ముందే ఆయన బుగ్గ కొరికేసిన హాట్ బ్యూటీ..!!

ఇదేం చంఢాలం..అందరి ముందే ఆయన బుగ్గ కొరికేసిన హాట్ బ్యూటీ..!!

సాధారణంగా మనం ఎవరైనా డాన్స్ బాగా చేస్తే ఏం చేస్తాం.. చప్పట్లు కొడతాం.. ఇంకా బాగ చేస్తే లేచి నిలబడి అభినందిస్తాం.. అంతకన్నా మరీ బాగా చేశారనిపిస్తే విజిల్స్ వేస్తాం.. లేదంటే వాళ్లతో కలిసి డాన్స్‌లు చేస్తాం.. మహా అయితే మరీ ఓ హగ్ ఇచ్చి సరిపెట్టడతాం. అంతేకదండీ..అయితే ఇలాంటివి ఇంతకు ముందు చూసి ఉంటారు.. ఇప్పుడు ట్రేండ్ మారింది.ఇప్పుడు డ్యాన్స్ బాగా చేస్తే బుగ్గు కొరికేస్తుంది ఈ జడ్జి.అవునండి “ఢీ” జడ్జి పూర్ణ ఇప్పుడు ఇలానే డ్యాన్స్ ఎవరు బాగా చేస్తే వాళ్ళ బుగ్గలు కొరికేస్తుంది.

బుల్లి తెర ప్రోగ్రాంల‌లో ఢీ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ డాన్స్ షో ఎన్నో ఏండ్ల‌ నుంచి టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ ఢీ షోకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు బుల్లితెరపై డాన్సుల పరంగా బాగా పాపులర్ అయిన షో ఢీ. అందులోంచే చాలా మంది పాపులర్ కొరియోగ్రఫర్స్ వచ్చారు.

శేఖర్ మాస్టర్ లాంటి డాన్స్ మాస్టర్స్ కూడా ఈ షో నుంచే వచ్చారు. ఢీ డాన్స్ షోలో యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుదీర్, హైపర్ ఆది లు చేసే కామెడీ షో కి హైలైట్ అవుతుంది.అయితే వాళ్ల కోసమే ఈ షోను చూసే వాళ్లు లేకపోలేదు. ఇదిలా ఉండగా అప్పుడప్పుడూ జడ్జిలు చేస్తున్న ఓవర్ యాక్షన్ విమర్శలకు తావిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో జడ్జి పూర్ణ చేసిన పనికి సెటైర్లు పేలుతున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఈ ప్రోమోలో భాగంగా ఓ డాన్సర్ బేబీ గెటప్ లో వస్తూ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడిన” మాటేరాని చిన్నదాని.. కళ్ళు పలికే ఊసులు”.. అనే సూపర్ హిట్ పాటకు ఎంతో అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డాన్స్ చేశారు. డాన్సర్ చేసిన డాన్స్ కి ఫిదా అయిన పూర్ణ ఏకంగా తన బుగ్గపై కొరకడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.

అయితే వీళ్ళు క్రేజ్ కోసం ఇంటెన్షనల్‌గా చేస్తున్నారా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. ఈ వీడియోని చూసిన ప్రేక్షకులంతా… వీరికి ఇదేం పిచ్చి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఢీ షోలో బుగ్గ కొరికే సీన్‌ మీరూ చూడండి…

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news