Gossipsఆ సీరియల్ లో తళుక్కుమన్నందుకు.. కృతి ఎంత తీసుకుందో తెలిస్తే..నోట మాట...

ఆ సీరియల్ లో తళుక్కుమన్నందుకు.. కృతి ఎంత తీసుకుందో తెలిస్తే..నోట మాట రాద్దంతే..?

మనం తరచూ వినే పదాలు అదృష్టం, అద్భుతం. ‘‘జీవితంలో ఏది కావాలన్నా అదృష్టం ఉండాలి. ఏదో ఒక అద్భుతం జరగాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. సుఖసంతోషాలతో అలరారుతుంది’’ అని కొందరు అనుకుంటారు. అయితే , అదృష్టం ఎప్పుడు..ఎవరిని.. ఎలా.. వరిస్తుందో మనం చెప్పలేం. ఎవరి దశ ఎప్పుడు ఎలా తిరుగుతుందో … అలా అదృష్ట లక్ష్మి వరిస్తుందో అసలకి చెప్పలేం. అలాంటి దానికి బెస్ట్ ఉదాహరణ.. ఈ కృతి పాప. అదేనండి కృతి శెట్టి..ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయి.. టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది.

వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన ఉప్పెన ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. త‌న మొద‌టి చిత్రంతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చేసిన మొదటి సినిమాతోనే ఆడియన్స్‌‌ని మేస్మైరైజ్ చేసింది ఉప్పెన భామ కృతిశెట్టి. కేవలం ఒకే ఒక్క సినిమాతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్నది కృతిశెట్టి. దీంతో టాప్ స్టార్స్ మొదలుకొని స్టార్ డైరెక్టర్ల చూపు ఇప్పుడు ఈ అమ్మాయి పైన పడింది. దీంతో అమ్మడు రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. డబుల్ కాదు ట్రిపుల్ పెంచేసింది. ఇప్పుడు ఈ అందాల భామ ఒక్క సినిమాకి ఏకంగా 2 నుండి 3 కోట్లు డిమాండ్ చేస్తుందట.

బెంగళూరులో పుట్టి ముంబయిలో పెరిగిన ఈ అమ్మడు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఫార్ములాను బాగా ఫాలో అవుతుంది. అందుకే క్రేజ్ ఉన్నప్పుడే బాగా డభులు డిమాండ్ చేస్తుందట. జి తెలుగులో ప్రసారమయ్యే కొత్త సీరియల్ లో మెరిసిన కృతి బేబీ రెమ్యునరేషన్ ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసిందట.

 

ఈమెకున్న డిమ్మాండ్ కి వాళ్లు కూడా ఓకే అన్నారట. అంతేకాదు..త్వరలో అదే ఛానల్ లో ప్రసారమయ్యే ఈవెంట్స్ లో కూడా కన్పించబోతోందట ఈ అమ్మడు. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఛానల్స్ తో అగ్రిమెంట్ చేసుకోవడం గ్రేట్.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news