Gossipsఆ స్టార్ హీరో.. ఆ క్రేజీ హీరోయిన్.. నిజంగానే లవ్ చేసుకున్నారట..!

ఆ స్టార్ హీరో.. ఆ క్రేజీ హీరోయిన్.. నిజంగానే లవ్ చేసుకున్నారట..!

సినిమా పరిశ్రమలో నటి నటుల మధ్య ఉన్న రిలేషన్షిప్స్ ఎపుడు సెన్సేషన్నల్ గానే ఉంటాయి. టాలీవుడ్‌లో హీరో హీరోయిన్ల రిలేషన్లు ఎప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంటాయి. ఎవరు ఎవరితో రేలేషన్ షిప్ లో ఉన్నారు అనేది ఆసక్తికరంగా ఉంటాయి. హీరో, హీరోయిన్స్ లో కూడా ఇలాంటి రెలేషన్స్ కామన్ గా కనిపిస్తుంటాయి.”

ఆ హీరో హీరోయిన్‌ రిలేషన్‌లో ఉండేవారు. ఓ హీరో, హీరోయిన్ రిలేషన్‌లో ఉంటున్నారు” అంటూ ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఏది లేకపోయినా ఏదో ఉందని సృష్టిస్తుంటారు కొందరు. అలా వచ్చిన వార్తల్లో నాగార్జున, టబు రిలేషన్‌ ఒకటి.

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, నటి టబు మధ్య రూమర్స్ అప్పట్లో బాగా వినిపించాయి. వీళ్లిద్దరు 10 సంవత్సరాల పైనే రిలేషన్ మెయింటైన్స్ చేశారని. టబు నాగార్జున ఇంట్లోనే ఉండేదని, వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు అని రూమర్స్ బయటకు వచ్చాయి. కానీ అమల, నాగార్జున ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమలని వదిలి నాగ్ తన దగ్గరికి రాడని తెలుసుకున్న టబు నెమ్మదిగా నాగార్జున కి దూరంగా వచ్చేసింది. అంటూ రకరకాల రూమర్స్ వచ్చాయి. టబు ఇంతవరకు పెళ్లి చేసుకోవడానికి కారణం ఇది కూడా ఒకటి అని చెబుతారు. అయితే ఈ రూమర్స్ పై ఇరువురు స్పందించకపోవడం వాటిని నిజమేనని నమ్మే పరిస్తితి ఏర్పడింది.

అప్పటికే నాగార్జున కి పెళ్లి అయినా కూడా కొంతమంది తమ ఆనందం కోసం ఈ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం అంటగట్టి వారినీ తీరని మనోవేదనకు గురిచేశారు. ఇక ఈ పుకార్లు ఎక్కువవుతుండగా.. వాటికి చెక్‌ పెట్టేందుకు 2006లో అమల రంగంలోకి దిగారు. అందరి ఘాటుగా సమాధానం ఇచ్చింది.

టబు తన స్నేహితురాలని చెప్పిన అమల.. తమ వ్యక్తిగత విషయాల్లో ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని గట్టిగా చెప్పారు. ”దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే.. అమల ఇంట్లో ఆమె ఫ్రెండ్ ఏం చేస్తుంది అన్న గాసిప్‌లపైనే ఎందుకు ఆసక్తిని చూపుతారో నాకు అర్థం కావడం లేదు. నా ఇంట్లో ఏం జరుగుతున్న దానిపై ఎవరూ అంత బాధపడాల్సిన అవసరం లేదు. తన నాకు మంచి స్నేహితురాలు” అని అమల అప్పట్లో ఓ క్లారిటీని ఇచ్చారు.

వీరిరువురు కలిసి 1995లో సిసింద్రీ, ఆ తర్వాత నిన్నే పెళ్ళాడుతా, ఆ తర్వాత ఆవిడ మా ఆవిడే వంటి మూడు సినిమాల్లో నటించి బెస్ట్ రొమాంటిక్ పెయిర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కాగా దాదాపు 12 ఏళ్ల తరువాత అల వైకుంఠపురములో మూవీ ద్వారా టబు టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news