Moviesబాలీవుడ్ భామ కోసం ప్రభాస్ స్వీట్ సర్ప్రైజ్.. ఏమిచ్చాడో చూడండి..!!

బాలీవుడ్ భామ కోసం ప్రభాస్ స్వీట్ సర్ప్రైజ్.. ఏమిచ్చాడో చూడండి..!!

ప్రభాస్‌.. ఆరు అడుగుల అందగాడు. డార్లింగ్ ప్రభాస్‌ వ్యక్తిత్వం గురించి మనందరికీ తెలిసిందే. స్టార్‌ హీరోగా ఎదిగిన ఇప్పటికీ సింప్లిసిటీని మెయింటెన్‌ చేస్తుంటాడు. అంతేకాదు సెట్‌లో నటీనటులతోపాటు టెక్నీషియన్స్‌తోనూ డార్లింగ్‌ సరదాగా ఉంటాడు. దీంతో అందరు ప్రభాస్ మనస్సు బంగారం అని చెబుతుంటారు. గోదావరి వంటకాలు ప్రభాస్ వారింట్లో ఫేమస్‌. అప్పుడప్పుడూ షూటింగ్‌లో ఉన్న వారికి తమ ఇంటి రుచులు చూపిస్తుంటారాయన. అలాగే వారికి నచ్చిన ఫుడ్‌ ఐటెమ్స్‌ను పార్శిల్స్‌ రూపంలోనూ పంపుతుంటారు.

ప్రభాస్ తో పని చేసే నటీనటులు ప్రభాస్ తిండి పెట్టి చంపేస్తాడని చెబుతుంటారు. ముఖ్య నటీనటులకు ప్రభాస్ ఇంటి నుంచి క్యారియర్లు వెళుతుంటాయని రకరకాల వంటకాలను చేయించి ప్రభాస్ సర్ ప్రైజ్ అయ్యేలా చేస్తుంటారని ప్రభాస్ సినిమాల్లో నటించే నటీనటులు అంటుంటారు.

అయితే తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ భాగ్యశ్రీకి పూతరేకులు పంపారు డార్లింగ్‌ ప్రభాస్‌. రాధేశ్యామ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న నటి భాగ్యశ్రీకి ప్రభాస్ తన సొంతూరి నుంచి పూతరేకులను తెప్పించారు. ఈ విషయాన్ని భాగ్యశ్రీ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ప్రభాస్ ఇచ్చిన స్వీట్ బాక్స్ లను ట్విట్టర్ లో షేర్ చేసిన భాగ్యశ్రీ పూతరేకులు ఎంతో రుచిగా ఉన్నాయని పేర్కొన్నారు.

“ఎంతో రుచికరమైన, కమ్మనైన హైదరాబాదీ స్వీట్లు అందాయి. థ్యాంక్స్‌ ప్రభాస్‌, మొత్తానికి నా అభిరుచినే మార్చేశావు” అంటూ ట్వీట్‌ చేసింది. దీంతో ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్ కు తల్లి పాత్రలో భాగ్యశ్రీ నటిస్తున్నారు. కాగా ప్రభాస్‌ ప్రస్తుతం రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్‌ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news