Gossipsరామ్ చరణ్, శంకర్ మూవీ కి పవర్ ఫుల్ టైటిల్.. తండ్రి...

రామ్ చరణ్, శంకర్ మూవీ కి పవర్ ఫుల్ టైటిల్.. తండ్రి సినిమా పేరే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బిగ్గెస్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. వరుస పాన్ ఇండియా సినిమాలతో హుషారెత్తించబోతున్నారు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ చేస్తున్న ఆయన.. మరో బడా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను లైన్‌లో పెట్టేశారు. దీంతో ఈ రెండు సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో “ఆర్‌సి 15” అనే పాన్ ఇండియా మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం… శంకర్, రామ్ చరణ్ మూవీ దిల్ రాజు నిర్మించనున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ యాక్షన్ డ్రామాలో చరణ్ తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ మూవీలో రామ్‌చరణ్‌ పోలీసాఫీసర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా మారే యువకుడి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ‘ఇండియన్‌ 2’ సినిమా వివాదంలో చిక్కుకున్న శంకర్‌కు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఊరటనిచ్చాయి. దీంతో రామ్‌చరణ్‌తో శంకర్‌ చేయనున్న ఈ సినిమాకు లైన్‌ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది.

ఇక అందుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాకి గతంలో మెగాస్టార్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘రుద్రనేత్ర’ అనే టైటిల్ పెట్టనున్నారని సమాచారం. కథ ప్రకారం ఈ టైటిల్ పక్కాగా యాప్ట్ అవుతుందని యూనిట్ దీనికే ఓటేసినట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారికంగా న్యూస్ మాత్రం బయటకు రావాల్సి ఉంది.

అయితే “ఆర్‌సి 15″ను మొదట్లో జూలై మొదటి వారం నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ భావించారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా చరణ్ నటిస్తున్న “ఆర్‌ఆర్‌ఆర్” మూవీ షూటింగ్ తో పాటు “ఆర్‌సి 15” ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ఆగిపోయాయి. ఇక తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ మొదటి వారం నుండి “ఆర్‌సి 15” సెట్స్ పైకి వెళ్లనుంది అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news